Samsung Galaxy S24 FE 5G: శాంసంగ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.! ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S24 FE 5G మొబైల్ ధర ఇప్పుడు ఊహించని విధంగా భారీగా తగ్గింది. ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌కు ఏమాత్రం తీసిపోని ఫీచర్లు ఉన్న ఈ ‘ఫ్యాన్ ఎడిషన్’ స్మార్ట్‌ఫోన్, లాంచ్ ధర కంటే ఏకంగా రూ.29,000 భారీ డిస్కౌంట్తో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్ కార్ట్ సేల్స్‌లో దీనిపై అద్భుతమైన డీల్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లభిస్తున్నాయి. దీనితో ఈ మొబైల్‌ను రూ. 35,000 లోపు ధరకే సొంతం చేసుకునే అవకాశం లభించింది. ఈ తగ్గింపుతో మంచి ప్రాసెసర్, అత్యుత్తమ కెమెరా, AI ఫీచర్లను కోరుకునే వారికి S24 FE 5G ఒక అద్భుతమైన ఎంపికగా మారింది.
గెలాక్సీ S24 FE 5G ఫోన్ స్పీడ్ అండ్ పెర్ఫార్మన్స్ విషయంలో రాజీ పడలేదు. ఈ మొబైల్ శాంసంగ్ ఎక్సినోస్ 2400e (4 nm) పవర్‌ఫుల్ డెకా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది గేమింగ్‌కు, మల్టీటాస్కింగ్‌కు అత్యుత్తమ అనుభవాన్ని అందిస్తుంది. ఈ గెలాక్సీ S24 సిరీస్‌లో పరిచయం చేయబడిన గెలాక్సీ AI ఫీచర్లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంది. ఇందులో ముఖ్యంగా సర్కిల్ టు సెర్చ్ (Circle to Search), లైవ్ ట్రాన్స్‌లేట్ (Live Translate) వంటి విప్లవాత్మక ఫీచర్లు ఉన్నాయి. ఈ AI ఫీచర్లు మీ రోజువారీ పనులను మరింత సులభతరం చేస్తాయి.
CM Chandrababu: పెట్టుబడులే లక్ష్యంగా దుబాయ్ చేరుకున్న సీఎం..!
ఈ మొబైల్ మరో ప్రధాన ఆకర్షణ దాని డిస్‌ప్లే, కెమెరాలు. ఇది 6.7 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే తో వస్తూ.. 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడటానికి ఈ డిస్‌ప్లే అత్యంత ప్రకాశవంతంగా, స్పష్టంగా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP + 12MP + 8MP కెమెరాలు ఉన్నాయి. ముందువైపు 10MP కెమెరా ఉంది. అలాగే ఈ ఫోన్ IP68 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.