50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy Jump 5 Launched: టెక్ దిగ్గజ సంస్థ శామ్సంగ్ (Samsung) తన స్వదేశ మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ శామ్సంగ్ గాలక్సీ జంప్ 5 (Samsung Galaxy Jump 5)ను లాంచ్ చేసింది. టెలికాం సంస్థ KT కార్పొరేషన్ భాగస్వామ్యంతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే స్పెసిఫికేషన్లు, డిజైన్, ఫీచర్ల పరంగా చూస్తే.. తాజాగా విడుదలైన శామ్సంగ్ గాలక్సీ A27 5Gకి ఇది దాదాపు సమానంగా ఉంది.
Super AMOLED డిస్ప్లే:
శామ్సంగ్ గాలక్సీ జంప్ 5లో 6.7 అంగుళాల Full HD+ (1080×2340 పిక్సెల్స్) సూపర్ AMOLED డిస్ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే 800 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ను అందించడంతో పాటు కార్నింగ్ గొరిల్లా విక్టస్+ ప్రొటెక్షన్‌ను కూడా కలిగి ఉంది.
Also Read
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
- Oppo Reno 16, Reno 16c: ఒప్పో రెనో 16, రెనో 16సి భారత్ లో విడుదల.. ఏఐ ఫీచర్లు, 7000mAh బ్యాటరీ
- Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్‌పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత శామ్సంగ్ వన్ UI 8.5 కస్టమ్ ఇంటర్ఫేస్తో వస్తుంది. Galaxy Jump 5కు సంబంధించి సాఫ్ట్వేర్ అప్డేట్ల వివరాలను వెల్లడించకపోయినా.. ఇదే స్పెసిఫికేషన్లతో వచ్చిన Galaxy A27 5Gకు 6 OS అప్గ్రేడ్లు, 6 సంవత్సరాల భద్రతా అప్డేట్లు అందిస్తామని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్:
ఫోటోగ్రఫీ కోసం Galaxy Jump 5లో ట్రిపుల్ రియర్ కెమెరా వ్యవస్థను అందించారు. ఇందులో f/1.8 అపర్చర్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో వస్తుంది. దీనికి తోడుగా 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో సెన్సార్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ప్రాసెసర్:
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో Qualcomm Snapdragon 6 Gen 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. 4nm తయారీ ప్రక్రియ ఆధారంగా రూపొందించిన ఈ చిప్ మెరుగైన పనితీరు, బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఫోన్లో LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు.
బ్యాటరీ:
ఈ స్మార్ట్‌ఫోన్ లో 5,000mAh భారీ బ్యాటరీని అందించారు. USB Type-C పోర్ట్ ద్వారా 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉంటుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా ఇందులో అమర్చారు.
ధర:
దక్షిణ కొరియాలో దీని ధర KRW 545,600గా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 34,000కు సమానం. ప్రస్తుతం ర్యాం, స్టోరేజ్ వేరియంట్ల వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 3 నుంచి KT ఆన్లైన్ స్టోర్ ద్వారా అమ్మకలకు అందుబాటులోకి రానుంది. నలుపు, ఆకుపచ్చ, గులాబీ రంగుల్లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!