Samsung Galaxy A07 4G: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) మరోసారి నిశ్శబ్దంగా తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Galaxy A07 4G ను ఇండోనేషియా మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్లు అందించబోతున్నదనే శాంసంగ్ హామీ ఇస్తుంది. బడ్జెట్ ఫోన్ విభాగంలో ఇది అరుదైన ఆఫర్‌గా చెప్పాలి.
Galaxy A07 4G ధర ఇండోనేషియాలో 4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ IDR 13,99,000 (రూ.7,500) నుండి ప్రారంభమవుతుంది. అలాగే 4GB RAM + 128GB వేరియంట్ ధర IDR 16,49,000 (రూ.8,900) కాగా, 8GB + 256GB వేరియంట్ ధర IDR 22,99,000 (12,400)గా నిర్ణయించారు. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, లైట్ వైలెట్ రంగుల్లో అందుబాటులో ఉంది.
314 Runs: మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్.. వన్డేల్లో 314 రన్స్ బాదిన భారత బ్యాటర్!
డిస్‌ప్లే:
గెలాక్సీ A07 4G లో 6.7 అంగుళాల HD+ ఇన్ఫినిటీ-U LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. అంటే స్క్రోలింగ్, వీడియో అనుభవం మరింత సాఫ్ట్‌గా ఉంటుంది. సాధారణంగా ఈ ధరలో 60Hz మాత్రమే లభిస్తుంది. ఇందులో 6nm MediaTek Helio G99 చిప్‌సెట్ అమర్చారు. ఇందులో గరిష్టంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ తో వస్తుంది. దీనిని మైక్రో SD సపోర్ట్ 2TB వరకు లభిస్తుంది.
సాఫ్ట్‌వేర్, అప్‌డేట్‌లు:
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఉన్న One UI 7 తో వస్తుంది. శాంసంగ్ దీనికి 6 సంవత్సరాల OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించబోతుంది. దీని వల్ల ఈ ఫోన్ దీర్ఘకాలిక ఉపయోగానికి సరైన ఆప్షన్ అవుతుంది.
Rashi Khanna: రాశి ఖన్నా మాటలతో మొదలైన .. నార్త్ ఇండస్ట్రీ vs సౌత్ ఇండస్ట్రీ రచ్చ
కెమెరా, బ్యాటరీ:
ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ఇందులో 5000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB Type-C పోర్ట్, Bluetooth 5.3, IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తం 184 గ్రాముల బరువు మాత్రమే ఉండి, 7.6mm సన్నని డిజైన్ తో ఫోన్ సొగసుగా కనిపిస్తుంది.