314 Runs: మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్.. వన్డేల్లో 314 రన్స్ బాదిన భారత బ్యాటర్!
- వన్డేల్లో మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్
- 314 రన్స్ బాదిన భారత సంతతి బ్యాటర్
- అంతర్జాతీయ క్రికెట్‌లో కాదు డొమెస్టిక్ క్రికెట్‌లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్డే క్రికెట్‌లో ఓ బ్యాటర్ సెంచరీ చేయడం సాధారణ విషయమే. డబుల్ సెంచరీ చేయడం చాలా అరుదు కానీ.. ప్రపంచ క్రికెట్‌లో చాలా మందే ఈ ఫీట్ అందుకున్నారు. ఇక 300 బంతులు ఉండే వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేయడం అంటే మాములు విషయం కాదు.. ఒకవేళ చేస్తే మహాద్భుతం అనే చెప్పాలి. ఈ అరుదైన రికార్డు తాజాగా చోటుచేసుకుంది. అయితే ఈ ఫీట్ నమోదైంది అంతర్జాతీయ క్రికెట్‌లో కాదు.. డొమెస్టిక్ క్రికెట్‌లో. సిడ్నీ గ్రేడ్ క్రికెట్‌లో భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ బ్యాటర్ హర్జాస్ సింగ్ 300లకు పైగా స్కోరు చేశాడు.
శనివారం ప్యాటర్న్ పార్క్‌లో సిడ్నీ క్రికెట్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్రన్ సబర్బ్స్ తరఫున హర్జాస్ సింగ్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. 141 బంతుల్లో 314 పరుగులు బాదాడు. హర్జాస్ ఇన్నింగ్స్‌లో 35 సిక్సర్లు ఉన్నాయి. హర్జాస్ చెలరేగడంతో వెస్ట్రన్ టీం ఏకంగా 474 పరుగులు చేసింది. హర్జాస్ దాటికి సిడ్నీకి చెందిన ఇద్దరు బౌలర్లు తమ కోటా 10 ఓవర్లలో 100కు పైగా పరుగులు సమర్పించారు. లక్ష్య ఛేదనలో సిడ్నీ 287 పరుగులే చేసి ఘోర ఓటమిని ఖాతాలో వేసుకుంది. హర్జాస్ తన సుడిగాలి ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. హర్జాస్ పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
హర్జాస్ సింగ్ అరుదైన ఎలైట్ క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. దేశీయ వన్డే క్రికెట్‌లో హర్జాస్ కంటే ముందు ఇద్దరి ట్రిపుల్ సెంచరీ చేశారు. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ ఫస్ట్-గ్రేడ్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్లలో ఫిల్ జాక్వెస్ (321), విక్టర్ ట్రంపర్ (335) ఉన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించిన ఈ యువ ఆటగాడు భారతదేశంలో తన మూలాలను కలిగి ఉన్నాడు. అతని తల్లిదండ్రులు భారత సంతతికి చెందినవారు, 2000లో చండీగఢ్ నుంచి సిడ్నీకి వలస వచ్చారు. దక్షిణాఫ్రికాలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 2024 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో హర్జాస్ 64 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అప్పుడే హర్జాస్ తన సత్తాచాటాడు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!