REDMI K90: Xiaomi సంస్థ చైనాలో నిర్వహించిన ఒక ఈవెంట్‌లో తమ వాగ్దానం మేరకు సరికొత్త REDMI K90 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. REDMI K90లో 6.59 అంగుళాల 2K AMOLED ఫ్లాట్ స్క్రీన్ ఉంది. ఇది 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్, 12-బిట్ 68.7 బిలియన్ రంగులకు మద్దతు ఇస్తుంది. అంతేకాక, ఇందులో కంటికి ఉపశమనం కలిగించే ఫుల్ బ్రైట్‌నెస్ DC డిమ్మింగ్ ఫీచర్‌ను కూడా అందించారు.
10th Class Exams: పదోతరగతి విద్యార్థులు అలర్ట్.. ఆరోజే పరీక్ష ఫీజు గడువుకు లాస్ట్..!
ఈ కొత్త REDMI K90 ఫోన్ Snapdragon 8 Elite SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌ను కలిగి ఉంది. అలాగే వేడిని సమర్థవంతంగా తగ్గించడానికి REDMI K90 లో గ్యాస్ లిక్విడ్ సెపరేషన్ డిజైన్‌తో కూడిన అద్భుతమైన కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. 5300mm² పెద్ద LHP (Liquid Heat Pipe), మూడు దశల డిజైన్ కోర్ ఉష్ణోగ్రతలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంది.
ఇక కెమెరా విభాగం విషయానికి వస్తే.. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 50MP 1/1.55″ లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్, Xiaomi AISP 2.0, 13.2EV హై డైనమిక్ రేంజ్ ఫీచర్లు ఉన్నాయి. దీనితోపాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10cm మాక్రో ఆప్షన్‌తో కూడిన 50MP 2.5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉంది. ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఆడియో అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇందులో 1115F అల్ట్రా-లీనియర్, సిమెట్రికల్ డ్యూయల్ స్పీకర్లు, సౌండ్ బై BOSE (Sound by BOSE) ట్యూనింగ్ ఉన్నాయి.
Keypad Phone: బ్రాండెడ్ మొబైల్ ఫోన్లు రూ. 1000 కంటే తక్కువ ధరకే.. 4G సపోర్ట్ తో
ఇక ఈ REDMI K90 భారీ 7100mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మెరుగైన ఛార్జింగ్ సామర్థ్యం కోసం ఇందులో కొత్తగా అప్‌గ్రేడ్ చేయబడిన Xiaomi Surge P3 స్మార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ చిప్, G1 బ్యాటరీ మేనేజ్మెంట్ చిప్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్ లైట్ పర్పుల్, ఆక్వా బ్లూ, బ్లాక్, వైట్ రంగులలో అందుబాటులో ఉంది. ఇక ధర విషయానికి వస్తే.. 12GB + 256GB వేరియంట్ 2599 యువాన్స్ (రూ. 32,045) నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో అమ్మకానికి వచ్చింది.