10th Class Exams: తెలంగాణలోని పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు (మార్చి-2026)కు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు గడువులు సంబంధిచి బిగ్ అప్డేట్ వెలుబడింది. పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు, అలాగే ఇదివరకు ఫెయిల్ అయిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి ఈ గడువులను ప్రకటించారు. లేట్ ఫీజు లేకుండా ఫీజు చెల్లించడానికి అక్టోబర్ 30, 2025 నుండి నవంబర్ 13, 2025 వరకు గడువుగా నిర్ణయించారు. విద్యార్థులు కట్టిన మొత్తాన్ని పాఠశాల హెచ్‌ఎంలు ఈ ఫీజును నవంబర్ 14 లోపల ట్రెజరీకి అందచేయాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు హెచ్‌ఎంలకు నవంబర్ 18, 2025 వరకు గడువు ఇవ్వబడింది.
HONOR-BYDల కీలక భాగస్వామ్యం.. కనెక్టివిటీ, AI ఏజెంట్ ఇంటిగ్రేషన్‌లో సరికొత్త ఆవిష్కరణలు.!
వీటితోపాటు లేట్ ఫీజు చెల్లింపులకు సంబంధించిన గడువులు కూడా ప్రకటించారు. రూ.50 లేట్ ఫీజుతో నవంబర్ 15 నుండి నవంబర్ 25 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.200 లేట్ ఫీజుతో నవంబర్ 29 నుండి డిసెంబర్ 12 వరకు చెల్లింపులు చేయవచ్చు. ఇక రూ.500 లేట్ ఫీజుతో అయితే, డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. డీజీఈ కార్యాలయం ఈ గడువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టంగా తెలిపింది.
ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేసీఆర్ కీలక సమావేశం!
ఇక పరీక్ష ఫీజు వివరాల విషయానికి వస్తే.. అన్ని సబ్జెక్టులకు ఫీజు రూ.125గా నిర్ణయించబడింది. మూడు సబ్జెక్టుల వరకు ఫీజు రూ.110 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే రూ.110 తో పాటు, ప్రతి అదనపు రెగ్యులర్ పరీక్షా సబ్జెక్టుకు రూ.60 చొప్పున అదనంగా చెల్లించాలి. ఈ ఫీజు నిబంధన SSC/OSSC/వొకేషనల్ కోర్సుల్లోని అకాడమిక్ సబ్జెక్టులకు కూడా వర్తిస్తుంది.
