Realme Neo 8 Infinite Edition: రియల్ మీ తన నియో సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రియల్‌మీ నియో 7కి అప్ డేట్ వైర్షన్ లో Realme Neo 8 వచ్చే నెల చైనాలో విడుదల కానున్నట్లు తెలుస్తుంది. అలాగే, ఈ సిరీస్‌లో మరో ప్రత్యేక మోడల్‌గా Realme Neo 8 Infinite Edition కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Read Also: US: అమెరికాలో ఘోర ప్రమాదం.. తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మృతి
రియల్‌మీ నియో 8 ఇన్‌ఫినైట్ ఎడిషన్..
Realme Neo 8 Infinite Edition రిటైల్ బాక్స్ ఫోటోను వీబోలో Fixed Focus Digital అనే యూజర్ షేర్ చేశాడు. ఈ బాక్స్‌పై ఫోన్ పేరు స్పష్టంగా కనిపించడంతో పాటు Next AI లోగో కూడా ఉంది. దీని ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీకి చెందిన AI ఆధారిత ఫీచర్లకు సపోర్టు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఫోన్ 2026 జనవరిలో చైనాలో లాంచ్ చేయనున్నట్లు అంచనా. అయితే, దీనిపై రియల్‌మీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
Read Also: Kohli New Record: సచిన్ రికార్డు బ్రేక్ దిశగా విరాట్ కోహ్లీ.. కేవలం 25 పరుగులు దూరంలో
శామ్‌సంగ్ AMOLED డిస్‌ప్లే హైలైట్
మరో ప్రముఖ టిప్‌స్టర్ Digital Chat Station వెల్లడించిన వివరాల ప్రకారం.. Realme Neo 8 Infinite Editionలో కస్టమ్ Samsung M14 AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.
Read Also: MSVG : గుంటూరులో మెగా సంబరాలు.. వెంకీ మామ, చిరు ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!
స్క్రీన్:
* 165Hz రిఫ్రెష్ రేట్
* కొత్త ల్యూమినిసెంట్ మెటీరియల్స్
* ఆధునిక డిస్‌ప్లే టెక్నాలజీతో వస్తుందని సమాచారం. దీని వల్ల మరింత క్లారిటీతో పాటు కళ్లకు తక్కువ ఒత్తిడి కలిగేలా Eye Protection ఫీచర్లు కూడా ఈ ఫోన్లో అందుబాటులో ఉండనున్నాయి.
Realme Neo 8 స్పెసిఫికేషన్స్ ఇవే:
ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Gen 5 (3nm టెక్నాలజీ)
డిస్‌ప్లే: 6.78-అంగుళాల LTPS ఫ్లాట్ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్
బ్యాటరీ: భారీ 8,000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ
చార్జింగ్: 80W ఫాస్ట్ చార్జింగ్
కెమెరా: 50MP ప్రైమరీ రియర్ కెమెరా
ఫింగర్‌ప్రింట్: 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్
RAM & స్టోరేజ్: LPDDR5x RAM, UFS 4.1 స్టోరేజ్
కనెక్టివిటీ: Wi-Fi 7, Bluetooth 5.4
ఇతర ఫీచర్లు: X-axis లీనియర్ మోటార్, IP68 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
టెక్ ప్రియులకు భారీ అప్‌గ్రేడ్
అయితే, బ్యాటరీ, డిస్‌ప్లే, ప్రాసెసర్ పరంగా చూస్తే, Realme Neo 8 సిరీస్ హై-పర్‌ఫార్మెన్స్ ఫ్లాగ్‌షిప్ కిల్లర్‌గా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా Infinite Editionలో శామ్‌సంగ్ AMOLED డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రాబోయే రోజుల్లో ఈ ఫోన్లపై మరిన్ని అధికారిక వివరాలు రియల్‌మీ వెల్లడించే ఛాన్స్ ఉంది.