Realme GT 8 Pro Dream Edition Lunch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన జీటీ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. రియల్‌మీ జీటీ 8 ప్రో, రియల్‌మీ జీటీ 8 ప్రో డ్రీమ్ ఎడిషన్ పేరిట తీసుకొచ్చింది. దాంతో తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను రియల్‌మీ మరింత విస్తరించింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు టాప్-ఎండ్ హార్డ్‌వేర్, రికో-ట్యూన్డ్ ఆప్టిక్స్, క్వాల్‌కామ్ 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వచ్చాయి. ముఖ్యంగా డ్రీమ్ ఎడిషన్ ప్రత్యేకంగా నిలిచింది. డ్రీమ్ ఎడిషన్‌లోని ఫీచర్స్ ఓసారి చూద్దాం.
ఆస్టన్ మార్టిన్-ప్రేరేపిత డిజైన్, టెక్స్చర్డ్ రియర్ ప్యానెల్ ద్వారా రియల్‌మీ జీటీ 8 ప్రో డ్రీమ్ ఎడిషన్ ప్రత్యేకంగా ఉంటుంది. డ్రీమ్ ఎడిషన్ సింగిల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. 16జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. ఈ ఫోన్ నవంబర్ 25 నుంచి అమ్మకానికి అందుబాటులోకి రానుంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఫ్లిప్‌కార్ట్ పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డ్రీమ్ ఎడిషన్ కొనుగోలు చేయొచ్చు. డ్రీమ్ ఎడిషన్‌కు లాంచ్ డిస్కౌంట్లను కంపనీ ప్రకటించలేదు. అయితే 12 నెలల EMI ప్లాన్ అందుబాటులో ఉంది.
రియల్‌మీ జీటీ 8 ప్రో డ్రీమ్ ఎడిషన్ 6.79 అంగుళాల QHD+BOE Q10 ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చింది. ఇందులో 144Hz రిఫ్రెష్‌రేటు, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 8 Elite జెన్ 5 ప్రాసెసర్ ఉండగా.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0తో రన్ అవుతుంది. 50 ఎంపీ సోనీ IMX906 ప్రధాన కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్, 200 ఎంపీ టెలిఫొటో కెమెరాతో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. రికో-ట్యూన్డ్ ఆప్టిక్స్ ఉండడంతో అద్భుతమైన ఫొటోస్ఎం వీడియోస్ తీసుకోవచ్చు. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. అది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
From its F1-inspired design language to its precision-crafted textures, the #realmeGT8Pro Dream Edition is made to feel as powerful as it looks.
Know More: https://t.co/SLF2jrPZbB https://t.co/SeQmMv1wi7#BestRacingPhone #RaceYourOwnWay #ExploreBeyondDefinition pic.twitter.com/gQrwsKmic5
— realme (@realmeIndia) November 19, 2025