Realme 11 Pro 5G: 200MP కెమెరా, 5000mAh బ్యాటరీ.. రియల్‌మీ 11 ప్రో స్మార్ట్‌ఫోన్ బుకింగ్, ఆఫర్స్ డీటెయిల్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme 11 Pro 5G Lunch Date in India: ‘రియల్‌మీ 11 ప్రో’ సిరీస్ ఇటీవలే భారతదేశంలో రిలీజ్ అయింది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడానికి మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రియల్‌మీ 11 ప్రో సిరీస్‌లో భాగంగా రియల్‌మీ 11 ప్రో (Realme 11 Pro 5G), రియల్‌మీ 11 ప్రో ప్లస్ (Realme 11 Pro+ 5G) స్మార్ట్‌ఫోన్‌లు రానున్నాయి. మేలోనే చైనాలో ఈ సీరీస్ రిలీజ్ కాగా.. భారతదేశంలో ఇప్పుడు విడుదల అయింది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఈ స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. జూన్ 15 మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫాన్స్ విక్రయాలు ప్రారంభమవుతాయి. జూన్ 16 మధ్యాహ్నం నుంచి అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్, కొన్ని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి వస్తాయి.
Realme 11 Pro 5G Specs:
రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తాయి. రెండింటిలోనూ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080×2,412 pixels) కర్వ్‌డ్ స్క్రీన్ ఉంటుంది. 6ఎన్‌ఎం ఆక్టాకోర్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ వీటిలో ఉంది. 12GB వరకు RAM మరియు 512GB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
Also Read
- Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
- Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
- Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
- Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
Realme 11 Pro 5G Price:
రియల్‌మీ 11 ప్రో 5జీ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999లుగా ఉంది. 8GB + 256GB వేరియంట్ ధర రూ.24,999 కాగా.. 12GB + 256GB వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. రియల్‌మీ 11 ప్రో ప్లస్ 5G 8GB + 256GB ధర రూ.27,999 కాగా.. 12GB + 256GB ధర రూ.29,999లుగా ఉంది. HDFC మరియు SBI కార్డ్‌లపై ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు.
Also Read:
Ram Charan-Upasana: అద్భుతమైన 11 సంవత్సరాలు.. ఉపాసన కొణిదెల ట్వీట్ వైరల్!
Realme 11 Pro 5G Camera:
రియల్‌మీ 11 ప్రో ఫోన్‌లో 100 మెగా పిక్సెల్ కెమెరా (100-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్) ఉంటుంది. రియల్‌మీ 11 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా (200-మెగాపిక్సెల్ Samsung HP3 ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్) ఉంది. ప్రోలో 16 మెగాపిక్సెల్, ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.
Realme 11 Pro 5G Battery:
రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు 5000mAh బ్యాటరీతో రానున్నాయి. ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండగా.. ప్రో స్మార్ట్‌ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఈ ఫాన్స్ మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!