Ram Charan-Upasana: అద్భుతమైన 11 సంవత్సరాలు.. ఉపాసన కొణిదెల ట్వీట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan and Upasana celebrates 11th Marriage Anniversary: బుధవారం టాలీవుడ్ ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల పెళ్లిరోజు. నిన్న వారు 11వ వివాహా వార్షికోత్సవం వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య ఉపాసనతో కలిసి ఉన్న ఫోటోలను రామ్ చరణ్ అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు ఉపాసన కూడా ఓ ఫోటో ట్వీట్ చేసి ‘అద్భుతమైన 11 సంవత్సరాలు’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్, ఉపాసన పెళ్లిరోజు సందర్భంగా అభిమానులు ఈ జంటకు శుభకాంక్షలు చెబుతున్నారు.
ఈ పెళ్లి రోజు రామ్ చరణ్, ఉపాసన కొణిదెలకు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఈ యేడాది మెగా ఇంట్లోకి మరో కొత్త వ్యక్తి రానున్నారు. త్వరలోనే చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. జూలైలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. ఆ క్షణ కోసం మెగా కుటుంబ సభ్యులు మరియు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత కొద్ది రోజులుగా చిరంజీవి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్న విషయం తెలిసిందే.
Also Read
రామ్ చరణ్, ఉపాసన ఎన్నో ఏళ్లు ప్రేమించుకొని..ఇరువురు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒకటయ్యారు. వీరిద్దరు 2012 జూన్ 14న పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరి పెళ్లి అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా జరిగింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంచర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరోవైపు అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని ఉపాసన నిర్వహిస్తున్నారు.
It’s been an awesome 11 years ❤️@AlwaysRamCharan pic.twitter.com/6Y7d7vfwvB
— Upasana Konidela (@upasanakonidela) June 14, 2023
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!