భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం రాత్రి పీఎస్‌ఎల్వీ-సీ 60 (PSLV-c60) రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి పంపింది. రాత్రి 10 గంటల 15 సెకెన్లకు నింగిలోకి దూసుకెళ్లింది. భారతదేశ అంతరిక్ష పరిశోధనలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా ఇస్రో అభివర్ణించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు నాంది పలికింది. స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతోపాటు ఇతర ప్రయోగాలకు మార్గదర్శనం చేయనుంది. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట రెండు ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే..
READ MORE: TG News: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి.. మంత్రులు విజ్ఞప్తి
స్పాడెక్స్ మిషన్ అంటే ఏమిటి?
ఈ మిషన్‌లో రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. మొదటి ఆ టార్గెట్ , రెండవది ఛేజర్. ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగంతో భవిష్యత్తులో కక్ష్యను వదిలి వేరే దిశలో వెళ్లే ఉపగ్రహాలను మళ్లీ కక్ష్యలోకి తీసుకొచ్చే సాంకేతికతను ఇస్రో పొందనుంది. పీఎస్‌ఎల్వీ ద్వారా ప్రయోగించిన రెండు చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింక్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. కాగా.. ఇస్రో ‘స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్’ సమయాన్ని సవరించి రెండు నిమిషాలు ముందుకు తీసుకెళ్లింది. అంతరిక్ష సంస్థ ఈ సమాచారాన్ని ముందుగానే అందించింది. భారత అంతరిక్ష కార్యక్రమంలో ఇదో ముఖ్యమైన మైలురాయి అని ఇస్రో పేర్కొంది. మిషన్ వాస్తవానికి సోమవారం రాత్రి 9:58 గంటలకు బదులుగా రాత్రి 10 గంటల 15 సెకన్లకు రాకెట్‌ను ప్రయోగించారు.