భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం రాత్రి పీఎస్‌ఎల్వీ-సీ 60 (PSLV-c60) రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి పంపింది. రాత్రి 10 గంటల 15 సెకెన్లకు నింగిలోకి దూసుకెళ్లింది. భారతదేశ అంతరిక్ష పరిశోధనలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా ఇస్రో అభివర్ణించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.
2024లో కంటే 2025లో ఎక్కువగా రాకెట్ ప్రయోగాలు చేపడతాం అని డాక్టర్ ఎస్.సోమనాథ్ తెలిపారు. గగన్‌యాన్ టెస్ట్ ఫ్లైట్‌ను కూడా మరో 2,3 మాసాల్లో ప్రయోగిస్తామని చెప్పారు. అమెరికాకు చెందిన నిసార్ ఉపగ్రహన్ని కూడా నింగిలోకి పంపనున్నామని సోమనాథ్ పేర్కొన్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ60ని నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి రాత్రి రాత్రి 10:05కి నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ60 రాకెట్…