Oppo Find X9 Pro: ఒప్పో (Oppo) అత్యాధునిక ఫ్లాగ్‌షిప్ మోడళ్లైన Oppo Find X9, Oppo Find X9 Pro సిరీస్‌ను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. తాజాగా విడుదలైన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు MediaTek Dimensity 9500 చిప్‌సెట్, అత్యాధునిక కెమెరా సామర్థ్యాలు, అత్యుత్తమ బ్యాటరీ టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మొబైల్స్ నవంబర్ 21 నుండి ఒప్పో ఇండియా స్టోర్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభమవుతాయి.
TTD Vaikuntha Darshan: భక్తులకు టీటీడీ శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం..
Find X9 సిరీస్‌లో రెండు స్మార్ట్ ఫోన్స్ తాజా ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పై పని చేస్తాయి. MediaTek Dimensity 9500 3nm చిప్‌సెట్ ఈ ఫోన్లకు అత్యుత్తమ పనితీరు అందించగా, కంపెనీ 5 OS అప్‌గ్రేడ్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని హామీ ఇస్తోంది. ఇక Find X9 లో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. ఇక కెమెరా విషయంలో 50MP+50MP+50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను Hasselblad తో కలిసి అభివృద్ధి చేశారు.ఇక 32MP ఫ్రంట్ కెమెరా, 7025mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 80W వైర్డుతో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా IP66, IP68, IP69 వంటి మూడు రకాల డస్టు, వాటర్ ప్రొటెక్షన్ రేటింగ్స్, Wi-Fi 7, బ్లూటూత్ 6.0 వంటి ఫ్యూచర్ ప్రూఫ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మరోవైపు Find X9 Pro మోడల్ మరింత ఆశ్చర్యపరిచే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఇది 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రావైడ్, అలాగే 200MP OIS టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 50MP సెల్ఫీ కెమెరా కూడా అద్భుతమైన ఫోటో క్వాలిటీని అందిస్తుంది. Pro మోడల్‌లో 7,500mAh పెద్ద బ్యాటరీ, 80W వైర్డుతో పాటు 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. దీని కూలింగ్ సిస్టమ్ కూడా అప్‌గ్రేడ్ అయ్యి VC కూలింగ్ సొల్యూషన్‌ను అందిస్తుంది. ఇక ధరల విషయానికి వస్తే.. Find X9 మోడల్ 12GB + 256GB వేరియంట్ రూ.74,999, 16GB + 512GB వేరియంట్ రూ.84,999 ధరలకు లభించగా.. Find X9 Pro 16GB + 512GB మోడల్ రూ.1,09,999కు అందుబాటులో ఉంటుంది. ఇక Find X9 కోసం ప్రత్యేకంగా రూపొందించిన Hasselblad Teleconverter Kit ను రూ.29,999కు విడిగా కొనుగోలు చేయవచ్చు.

