TTD Vaikuntha Darshan: శ్రీవారి భక్తులకు శుభవార్త చెబుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈసారి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. డిసెంబర్ 30వ తేదీ నుండి వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీ వరకు భక్తులకు ఈ ప్రత్యేక దర్శనావకాశం అందుబాటులో ఉండనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి సాధారణ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
Read Also: CM Revanth Reddy: మోడీ దేశానికి బడే భాయ్.. రాష్ట్రాల అభివృద్ధికి మద్దతు ఇవ్వండి..
ఇక, పది రోజుల కాలంలో 182 గంటల దర్శన సమయం ఉండగా.. అందులో 164 గంటలు సాధారణ భక్తులకే ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మొదటి 3 రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. వైకుంఠ దర్శనాల ప్రారంభయ్యే మూడు రోజులు రూ.300 దర్శనం, శ్రీవాణి దర్శనం రద్దు చేయబడ్డాయని.. జనవరి 2 నుండి టికెట్ కేటాయింపు ఉంటుందని ప్రకటించింది.. జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రూ.300 దర్శన టికెట్లు 15,000 వేల చొప్పున విడుదల చేయనున్నారు.. శ్రీవాణి దర్శనాలకు సంబంధించిన టికెట్లు 1,000 చొప్పున అందుబాటులో ఉంచుతారు.. ఈ టికెట్లు సాధారణ పద్ధతిలో ఆన్‌లైన్ ద్వారా జారీ అవుతాయి.
మొదటి మూడు రోజులకు ఈ-డిప్ సిస్టమ్ ద్వారా అంటే, డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1వ తేదీల దర్శనాలకు అనుమతి ఇస్తారు.. ఈ-డిప్ ద్వారా టికెట్లు కేటాయింపు జరుగుతుంది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుంది.. డిసెంబర్ 2న లాటరీ విధానంలో ఎంపికైన వారికి టోకెన్ల కేటాయిస్తారు.. టీటీడీ వెబ్‌సైట్‌తో పాటు.. మొబైల్ యాప్, వాట్సాప్ సిస్టమ్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్, టోకెన్ కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందని అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వారా దర్శనం సందర్భంగా స్థానికులకు ప్రత్యేక కేటాయింపులు చేసింది టీటీడీ.. తిరుమల–తిరుపతి ప్రాంత భక్తులకు.. జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకి 5,000 టోకెన్లు కేటాయించనున్నారు.
ఈ ఏడాది వైకుంఠ దర్శనాల సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక దర్శనం ఏడు రోజులపాటు రద్దు చేయబడింది. అత్యవసరంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పించబడుతుంది అని టీటీడీ స్పష్టం చేసింది.. క్యూలైన్‌లో నేరుగా నిల్చుని వచ్చే భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమలలో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేసింది. కాగా, వైకుంఠ ద్వారా దర్శనానికి ప్రతీ ఏడాది భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలు తరలివచ్చే విషయం విదితమే.