OnePlus Ace 6T: వన్ ప్లస్ (OnePlus) సంస్థ Ace 6 స్మార్ట్‌ఫోన్‌ను గత నెలలో లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు చైనాలో OnePlus Ace 6T ని ఈ నవంబర్ చివరిలో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ సామ్రాట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 SoC (సిస్టమ్-ఆన్-చిప్) తో పనిచేయనున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. తాజాగా ఇందుకు సంబంధించి టీజర్ విడుదలింది. ఇందులో ఫోన్‌కు మెటల్ ఫ్రేమ్ ఉంటుందని అర్థమవుతుంది. ఈ ఫోన్ భారీ పనితీరును అందించే కొత్త ఫ్లాగ్‌షిప్ ఎంపిక అవుతుందని, దాని గేమింగ్ అనుభవం అత్యద్భుతంగా ఉంటుందని సంస్థ చైనా హెడ్ పేర్కొన్నారు. ఈ ఫోన్ 165Hz స్క్రీన్‌తో రానుంది. ఇది 165fps గేమింగ్‌ను అందించగలదు. రాబోయే ఈ స్మార్ట్ ఫోన్ లో భారీ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. అందిన సమాచారం ప్రకారం 8000mAh కంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉండనుంది.
Smartphone Sales: భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు.. రికార్డు స్థాయిలో ఆపిల్ సేల్స్..!
ఈ ఫోన్‌లో ఫ్యాక్టరీ-ఇన్‌స్టాల్ చేసిన కొత్త తరం ‘విండ్ ఛేజర్ గేమింగ్ కెర్నల్’ ఉంటుంది. ఇది 165Hz అల్ట్రా-హై ఫ్రేమ్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక మొబైల్ గేమ్‌కు 165Hz అడాప్టేషన్‌ను పొందిన తొలి ఫోన్ ఇదే కానుంది. వన్ ప్లస్ తన గ్లోబల్ లాంచ్‌లో OnePlus 15 విడుదల సందర్భంగా ఈ ఏడాది చివరిలో OnePlus 15R ను కూడా విడుదల చేస్తామని ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో ఈ Ace 6T మోడల్ అంతర్జాతీయంగా OnePlus 15R పేరుతో విడుదలవుతుందా..? లేక Ace 6 గా వస్తుందా అనేది త్వరలోనే తెలియనుంది.
Saudi Bus Accident: సౌదీలో బస్సు తగులబడి 42 మంది మృతి.. మృతుల్లో మక్కాకు వెళ్లిన హైదరాబాదీలే అధికం..