Smartphone Sales: భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు.. రికార్డు స్థాయిలో ఆపిల్ సేల్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smartphone Sales: ఈ ఏడాది జులై-సెప్టెంబరు త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ బలమైన వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ (IDC) నివేదిక ప్రకారం.. ఈ త్రైమాసికంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 4.3% వృద్ధికి పైగా ఉండగా.. 4.8 కోట్ల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఇది గత ఐదేళ్లలో భారీ అభివృద్ధిగా నమోదైంది. ఈ త్రైమాసికంలో చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో 18.3% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ప్రీమియం విభాగంలో ఆధిపత్యం చెలాయించే ఆపిల్ సంస్థ ఈ త్రైమాసికంలో 50 లక్షల ఐఫోన్ లను విక్రయించింది. ఒక త్రైమాసికంలో యాపిల్‌కు ఇవే అత్యధిక విక్రయాలని నివేదిక వెల్లడించింది.
Bus Accident: సౌదీలో బస్సు తగులబడి 42 మంది మృతి.. మృతుల్లో మక్కాకు వెళ్లిన హైదరాబాదీలే అధికం..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇక రూ.50000 ధర ఉండే హై-ప్రీమియం విభాగంలో, అలాగే రూ.70,000 పైన ఉండే సూపర్ ప్రీమియం విభాగంలో ఆపిల్ సంస్థ అగ్రస్థానం సాధించింది. ప్రీమియం విభాగంలో అమ్మకాలు 43.3% వృద్ధి చెందడంతో యాపిల్ మార్కెట్ వాటా 4% నుంచి 6 శాతానికి పెరిగింది. ఇందులో 70% కంటే ఎక్కువ ఐఫోన్ 16, ఐఫోన్ 15, ఐఫోన్ 17 మోడళ్ల ద్వారానేరావడం గమనార్హం. ఇక సూపర్ ప్రీమియం విభాగం 52.9% వృద్ధి చెందడంతో దీని మార్కెట్ వాటా 6 నుంచి 8 cకి చేరుకుంది. ఈ విభాగాలలో 66 శాతం ఆపిల్, 31 శాతం వాటాతో శాంసంగ్‌ను అధిగమించింది.
ఇక ఎక్కువ స్పెసిఫికేషన్లు ఉన్న మోడళ్లకు ప్రజల నుంచి గిరాకీ పెరగడంతో.. గత త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర రికార్డు స్థాయిలో 294 డాలర్స్ (రూ. 26,000)కు చేరుకుంది. 2024 ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 13.7% అధికం. దీని ద్వారా వినియోగదారులు మెరుగైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..