కొత్త ‘Nothing Ear (Open)’ TWS ఇయర్‌బడ్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!
- నథింగ్ Ear (Open) TWS ఇయర్‌బడ్స్ భారత్‌లో లాంచ్
- టైటానియం డ్రైవర్, ChatGPT ఫీచర్
- 30 గంటల ప్లేబ్యాక్‌తో కేవలం రూ. 9,999కే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nothing Ear (Open) TWS: నథింగ్ సంస్థ కొత్తగా ‘Nothing Ear (Open)’ TWS ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో పరిచయం చేసిన ఈ మోడల్‌ను ఇప్పుడు అధికారికంగా లాంచ్ చేసింది. ఇవి కంపెనీ తొలి ఓపెన్ ఇయర్ స్టైల్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్.
డిజైన్:
ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకమైన పేటెంట్ పెండింగ్ డయాఫ్రాగమ్ డిజైన్, టైటానియం కోటింగ్, అల్ట్రా లైట్ డ్రైవర్ మరియు స్టెప్ప్డ్ డిజైన్‌తో వస్తాయి. ఈ కస్టమ్ డిజైన్ డిస్టర్షన్‌ను తగ్గిస్తూ, లో ఫ్రీక్వెన్సీలను మెరుగుపరుస్తుంది. టైటానియం కోటింగ్ వల్ల హై నోట్లు మరింత స్పష్టంగా వినిపిస్తాయి. ఇయర్ హుక్‌లో నికెల్ టైటానియం వైర్ వాడటం వల్ల ఇది ఫ్లెక్సిబుల్‌గా, అదే సమయంలో దృఢంగా ఉంటుంది.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ఆడియో ఫీచర్లు:
ఆటోమేటిక్ బాస్ ఎన్‌హాన్స్ అల్గారిథమ్ లో ఫ్రీక్వెన్సీలను ఆప్టిమైజ్ చేస్తూ, మంచి బాస్ అనుభవం ఇస్తుంది. అలాగే క్లియర్ వాయిస్ టెక్నాలజీ వల్ల గాలి శబ్దం ఎక్కువగా ఉన్నా లేదా పక్కా శబ్దపూరిత వాతావరణంలోనూ స్పష్టమైన కాల్స్ చేయగలుగుతారు.
Rape Case: ఉద్యోగం పేరుతో హోటల్ కు పిలిచి.. అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్..
స్మార్ట్ ఫీచర్లు:
ఈ ఇయర్‌బడ్స్‌లో ChatGPT ఇంటిగ్రేషన్ కూడా ఉంది. అంతేకాకుండా, AI ఆధారిత ప్రాసెసింగ్‌తో 2.8 కోట్లకుపైగా శబ్ద పరిస్థితులపై ట్రైనింగ్ చేయబడింది. ఇయర్‌బడ్ బరువు 8.1 గ్రాములు, ఛార్జింగ్ బాక్స్ బరువు 63.8 గ్రాములు. వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ (IP54) కూడా ఉంది.
బ్యాటరీ & కనెక్టివిటీ:
14.2mm డైనమిక్ డ్రైవర్ కలిగిన ఈ ఇయర్‌బడ్స్‌లో 64mAh బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ లేదా 6 గంటల టాక్‌టైమ్ ఇస్తాయి. 635mAh కేస్‌తో కలిపి 30 గంటల వరకు ప్లేబ్యాక్, 24 గంటల వరకు టాక్‌టైమ్ అందుతుంది. 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్‌తో 2 గంటల మ్యూజిక్ వినిపిస్తుంది. ఇక Bluetooth 5.3 సపోర్ట్‌తో పాటు Google Fast Pair, Microsoft Swift Pair, డ్యూయల్ కనెక్షన్ కూడా లభిస్తుంది. అలాగే, 120ms లో ల్యాగ్ మోడ్, పించ్ కంట్రోల్స్ (ప్లే/పాజ్, ట్రాక్ స్కిప్, కాల్ అన్‌సర్/రిజెక్ట్, ANC/ట్రాన్స్‌పరెన్సీ మోడ్ స్విచ్, వాల్యూమ్ కంట్రోల్) వంటి ఫీచర్లు ఉన్నాయి.
Tollywood : సెప్టెంబరులో కళకళలాడిన టాలీవుడ్
ధర:
Nothing Ear (Open) వైట్ కలర్‌లో ఫ్లిప్ కార్ట్ లో రూ. 9,999 ధరకు అందుబాటులో ఉంది. ఇది బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా లభిస్తుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..