టాలీవుడ్‌లో నెలకో హిట్ పడటం కష్టం అనుకుంటున్న తరుణంలో సెప్టెంబర్ మంత్ మాత్రం త్రీ బ్లాక్ బస్టర్స్ అందించి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ , కిష్కిందపురి, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో వచ్చిన మిరాయ్‌ని ఆదరించారు టీఎఫ్ఐ ఫ్యాన్స్. కేవలం ఘాటీకి మాత్రమే చుక్కెదురైంది. భారీ బడ్జెట్ కాదు. కంటెంట్ మ్యాటర్ అని మరోసారి ఫ్రూవ్ చేశాయి హిట్టైన త్రీ ఫిల్మ్స్.
జీరో ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన లిటిల్ ఫిల్మ్ లిటిల్ హార్ట్స్‌ను టాలీవుడ్ మూవీ లవర్స్ బిగ్ హార్ట్స్ తో హిట్ చేసేశారు. ఓటీటీలోకి తీసుకెళదామనుకున్న ఈ ఫిల్మ్స్ పై నమ్మకంతో థియేటర్లలోకి తెచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 12న అనుకుని కూడా వారం ముందే థియేటర్లలోకి తెచ్చారంటే.. సినిమాపై వారికున్న నమ్మకం అలాంటిది. కానీ ఆ బిలీవ్ వమ్ముకాలేదు. రూ. 3 కోట్లతో తెరకెక్కిన లిటిల్ హార్ట్స్.. నియర్లీ రూ. 40 కోట్లను కొల్లగొట్టింది. ఇక్కడే కాదు ఓవర్సీస్‌లోనూ దున్నేసింది. సెప్టెంబర్ 12న పోటీపోటీగా వచ్చాయి మిరాయ్ అండ్ కిష్కింద పురి. హనుమాన్ హిట్టుతో తేజ సజ్జా నెక్ట్స్ ఫిల్మ్ మిరాయ్‌పై అంచనాలున్నా. కార్తీక్ ఘట్టమనేని టేకింగ్ పై అనుమానాలు వచ్చాయి. దీనికి ముందు రవితేజతో తీసిన ఈగల్ భారీ డిజాస్టర్ కావడంతో ఇవే ప్రశ్నలు ఎదురైతే టీం కూడా నెక్ట్స్ ఇవి రిపీట్ కావంటూ స్పందించింది. అన్నట్టుగానే విజువల్ వండర్‌గా తీసుకువచ్చాడు కార్తీక్. రూ. 60 కోట్లతో వీఎఫ్ఎక్స్‌తో వండర్స్ క్రియేట్ చేయొచ్చని కొన్ని సినిమాలకు లెసన్స్ నేర్పించినట్లైంది మిరాయ్. మొత్తానికి రూ. 100 కోట్లను దాటేసి ఓవర్సీస్‌లోనూ సత్తా చాటుతోంది.
రాక్షసుడు తర్వాత హిట్ కొట్టని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు సెప్టెంబర్ మంత్‌తో పాటు మరో సెంటిమెంట్ కలిసొచ్చింది. రూ. 20 కోట్లతో తెరకెక్కించిన కిష్కింద పురి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల బాటలో నడుస్తోంది. రాక్షసుడులో నటించిన అనుపమతో కలిసి మరో హిట్ నమోదు చేశాడు బెల్లంకొండ. ఇక ఇప్పుడు పవర్ స్టార్ వంతు. హరి హర వీరమల్లుతో ప్లాప్ చూసిన పవన్ కళ్యాణ్ ఓజీతో వస్తున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలున్నాయి. మూడేళ్లుగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 25న రాబోతుంది. మరీ సెప్టెంబర్ సెంటిమెంట్ పవర్ స్టార్ కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.