మార్కెట్లోకి రోజుకో కొత్త మోడల్ వెరైటీ వెరైటీ ఫీచర్స్‌తో అడుగు పెడుతూ.. అందరి మనుసును దోచుకుంటున్నాయి. అయితే.. కొత్త మొబైల్స్‌లో వస్తున్న ఫీచర్స్ కవ్విస్తుంటే.. యువత ఇప్పుడున్న మొబైల్స్‌కు స్వస్తి చెబుతూ.. కొత్త ఫోన్స్ వెంట పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా మొటొరొలా మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత విపణిలోకి తీసుకురానుంది. అదే.. మొటొరొలా మోటో జీ22. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంఛ్ కానుంది. దీనిలో నాలుగు కలర్స్‌లో హైఎండ్ స్పెసిఫికేషన్స్‌తో కస్టమర్ల ముందుకు రానుందని తాజా లీక్స్‌లో వెల్లడైంది. మోటో జీ22 కీలక ఫీచర్లు ఇవే నుంటూ వినిఫ్యూచర్ అనే పబ్లికేషన్స్ పలు వివరాలు తెలిపింది.
మోటో జీ22లో… ఫోన్ ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేసే సామర్ధ్యంతో.. 6.53 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగిఉంటుంది. రియర్ సైడ్ 50 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 8 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో కస్టమర్లను ఆకర్షించనుంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్‌పై మోటోరోలా బ్యాట్‌వింగ్ లోగో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో జీ37 ప్రాసెసర్‌ను కలిగిఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేయనుండగా.. మోటో జీ22 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 10డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్‌తో కస్టమర్ల చేతిలో అద్బుతం సృష్టించనుంది.