Moto G57 Power: మోటరోలా సంస్థకు చెందిన కొత్త G Power సిరీస్‌లోని Moto G57 Power స్మార్ట్‌ఫోన్ ను నవంబర్ 24న భారత మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవల గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు భారత వినియోగదారులకూ అందుబాటులోకి రాబోతోంది. కొత్త Snapdragon 6s Gen 4 SoC చిప్‌సెట్‌తో ప్రపంచంలో మొదటిసారిగా రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్ రేంజ్ విభాగంలో మంచి పనితీరును అందిస్తుంది. కెమెరా, డిస్‌ప్లే పరంగా కూడా ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 50MP Sony LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 6.72 అంగుళాల FHD+ 120Hz డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ, IP64 రేటింగ్ వంటి ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఫోన్‌ను మరింత మన్నికైనదిగా మార్చుతుంది.
DoT హెచ్చరిక.. ఇకపై IMEI రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. మరింత కఠినంగా మారిన టెలికాం చట్టం..!

ఈ ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీ ఉండటం దీని ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో బాక్స్ నుండి బయటకు వచ్చే తొలి ఫోన్‌లలో ఇదొకటి. మోటరోలా ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్‌తో పాటు మూడు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఇక మెమరీ, ఆడియో పరంగా చూస్తే.. Moto G57 Power మొబైల్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో లభ్యం కాబోతోంది. స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ ఆడియో అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ఫోన్‌ను పాంటోన్ రెగట్టా, పాంటోన్ కోర్సెయిర్, పాంటోన్ ఫ్లూయిడిటీ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందిస్తున్నారు. లాంచ్ అనంతరం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్సైటు, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ ధరను నవంబర్ 24న అధికారిక లాంచ్ కార్యక్రమంలో ప్రకటించనున్నారు.
SSRMB : రాజమౌళి ‘వారణాసి’ బడ్జెట్.. రెమ్యునరేషన్స్ తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే?
