విరాట్ కోహ్లీ వాడే ‘హూప్’ కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Fitbit Air: ఫిట్నెస్ ప్రియుల కోసం గూగుల్ ఒక సరికొత్త పరికరాన్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ‘గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్’ (Google Fitbit Air) పేరుతో స్క్రీన్ లేకుండా రాబోతున్న ఈ ప్రత్యేకమైన ఫిట్నెస్ ట్రాకర్‌ను ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ఈవెంట్ వేదికగా కంపెనీ సూచనప్రాయంగా వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో డిస్ప్లే లేని ఫిట్నెస్ బ్యాండ్లకు ఆదరణ బాగా పెరుగుతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు అనేకమంది అంతర్జాతీయ అథ్లెట్లు డిస్ప్లే లేని ‘హూప్’ (Whoop) వంటి ట్రాకర్లను ఉపయోగిస్తుండటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ విభాగంలో ఉన్న డిమాండ్‌ను పసిగట్టిన గూగుల్, రేసులో వెనుకబడిపోకుండా ఉండేందుకే ఈ డివైజ్‌ను డిజైన్ చేసింది.
గూగుల్ రాబోయే ఈ ఫిట్‌బిట్ ఎయిర్ కేవలం 12 గ్రాముల బరువుమాత్రమే ఉండటం విశేషం. బరువు తక్కువగా ఉండటం, డిస్ప్లే లేకపోవడం వల్ల దీనిని రోజంతా హాయిగా ధరించవచ్చు. డిస్ప్లే లేనప్పటికీ, హెల్త్ ట్రాకింగ్ విషయంలో గూగుల్ ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అధునాతన సెన్సార్లను అందించింది. ఇందులో గుండె వేగాన్ని పరిశీలించే హార్ట్ రేట్ ట్రాకర్, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని కొలిచే బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్‌తో పాటు మనం చేసే రకరకాల వర్కౌట్లను ఆటోమేటిక్‌గా గుర్తించే ప్రత్యేక సెన్సార్లు ఉన్నాయి. దీనికి తోడు కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే AI హెల్త్ ఇన్సైట్స్ ద్వారా యూజర్ ఆరోగ్యానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని ఇది విశ్లేషించి ఇస్తుంది.
Also Read
- Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
- TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
- Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
- iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
ఈ ఫిట్నెస్ ట్రాకర్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవడం ద్వారా దీనిలోని డేటానంతా నేరుగా గూగుల్ హెల్త్ యాప్‌లో సమగ్రంగా చూసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే, ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 7 రోజుల పాటు సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే ఈవెంట్ సమయంలో గూగుల్ దీని స్పెసిఫికేషన్లను పూర్తిగా వివరంగా వెల్లడించలేదు. అలాగే భారతదేశంలో కచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర సుమారు 99.99 అమెరికన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 9,500)వరకు ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?