IPhone 17 Pro: చాలా మంది ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కొనాలని తహతహలాడుతుంటారు. కానీ అధిక ధర కారణంగా కొనలేక పోతారు. ఫోన్ ధర తగ్గేందుకు కొంత మంది పాత హ్యాండ్‌సెట్‌లను అమ్ముతారు లేదా ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ప్రత్యేకమైన రీతిలో రూ.1.35 లక్షల విలువైన ఐఫోన్ 17 ప్రోను కేవలం రూ.40,470కే కొనుగోలు చేశాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Droupadi Murmu: కేరళ పర్యటనలో రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం
ఆపిల్ సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 ప్రోను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.134,999. అయితే.. తాజాగా ఓ కస్టమర్ ఎక్స్ ప్లాట్‌ఫామ్ (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశాడు. ఐఫోన్ 17 ప్రోను కేవలం రూ.40,470కి కొనుగోలు చేశాడని పేర్కొంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. సాహిల్ పహ్వా అనే యూజర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో తాను ఉపయోగించిన ట్రిక్‌ని కూడా షేర్ చేశాడు.
READ MORE: Razesh Danda : నా సినిమాను చంపేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా
HDFC ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్ నుంచి పాయింట్లను రీడీమ్ చేసుకుని ఫోన్ కొన్నట్లు పేర్కొన్నాడు. HDFC పోర్టల్ ప్రకారం.. ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్‌ను వాడటం వల్ల మీకు నిర్దిష్ట సంఖ్యలో పాయింట్లు లభిస్తాయి. మీరు ఈ పాయింట్లను SmartBuy పోర్టల్‌లో ఉపయోగించి కొనుగోలు చేస్తే ధర తగ్గుతుంది. యూజర్ పోస్ట్‌లో స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. వారు ఆర్డర్ ఐడిని పోస్ట్ చేశాడు. అందులో ఫోన్ ధర రూ. 134,999 అని ఉంది. 94,430 క్రెడిట్ కార్డ్ పాయింట్లను ఉపయోగించి రూ. 40,470 నగదుకే ఫోన్ సొంతం చేసుకున్నాడు. HDFC బ్యాంక్ లేదా ఇతర బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి రివార్డ్‌లను పొందిన వారు వాటిని రీడీమ్ చేసుకోవచ్చు. కానీ.. ఇలాంటి రివార్డ్ పాయింట్స్ సాధించడం చాలా అరుదు అని నిపుణులు చెబుతున్నారు.