ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్రపంచంలో పెద్ద మార్పును తీసుకువస్తోంది. ఇది స్వయంప్రతిపత్త వాహనాల నుంచి వర్చువల్ అసిస్టెంట్ల వరకు ప్రతిదానిలో ఉంటుంది. ఏఐ యొక్క శక్తితో, వ్యాపారాలలో ప్రక్రియలు స్వయంచాలకంగా మారుతున్నాయి. అనుభవాలు మెరుగుపరచబడుతున్నాయి. దీనితో పాటు, పెద్ద డేటాసెట్ల నుంచి కొత్త అవకాశాలను కనుగొనడం కూడా సులభం అవుతుంది. కాగా.. అందరిలో ఏఐ ద్వారా ఉద్యోగాలు మాయమవుతాయన్న అపోహలు ఉన్నాయి. ఏఐ మూలంగా లక్షలాది ఉద్యోగాలు మటుమాయమవుతున్న మాట నిజం. అయితే 2025 సంవత్సరం నాటికి ఏఐ, తన మూలంగా మాయమవుతున్న ఉద్యోగాల కంటే 12 మిలియన్ ఉద్యోగాలను అధికంగా సృష్టించనున్నదని అంచనా. ఒక్క భారతదేశంలోనే రాబోయే కొద్ది సంవత్సరాలలో దాదాపు 4 లక్షల కొత్త ఉద్యోగాలు ఏఐ మూలంగా సృష్టించబడతాయంటున్నారు నిపుణులు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే వేలాది ఇంజినీరింగ్ నిపుణులు ఎఐలోను, ఎఐ సంబంధిత సాంకేతికతలలోను శిక్షణ పొందుతున్నారు.
READ MORE: Italy: ఆడి ఇటలీ అధినేత కన్నుమూత.. 10 వేల అడుగుల ఎత్తు నుంచి పడి మృతి
ఇదిలా ఉండగా.. చాట్‌జీపీటీని ఓపెన్ఏఐ లాంచ్ చేసినప్పుడు, గత ఏడాది చివరిలో ఏఐ ప్రకంపనాలు మళ్లీ మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టిన చాట్‌జీపీటీ మనం అడిగే ప్రశ్నలకు దాదాపు మానవుని తరహాలోనే సమాధానాలను ఇవ్వగలదు. క్షణాల్లోనే వ్యాసాలను, ప్రసంగాలను అందిస్తుంది. చాట్‌జీపీటీ మార్కెట్లోకి వచ్చి తన ప్రాబల్యాన్ని చాటిన తర్వాత, ఇతర టెక్ దిగ్గజాలు సైతం సొంతంగా తమ కృత్రిమ మేధ వ్యవస్థలను లాంచ్ చేసే ప్రయత్నాలలో పడ్డాయి. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ మార్చి నెలలో తన ఏఐ సిస్టమ్ బార్డ్‌ను లాంచ్ చేసింది. ఇది పూర్తిగా కచ్చితమైనది కానప్పటికీ, ఇంటర్నెట్‌లో ఉన్న పెద్ద మొత్తంలో డేటాను వాడుకుని ఈ సిస్టమ్స్‌కు శిక్షణ ఇచ్చారు. చాలా మంది ఏఐ వల్ల ఏ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయనే విషయంపై ఆశ్చర్యంగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో గోల్డ్‌మ్యాన్ శాక్స్ విడుదల చేసిన నివేదికలో, 30 కోట్ల ఫుల్ టైమ్ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని తెలిపింది.
READ MORE: AICC: ఏఐసీసీ కొత్త కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో మల్లికార్జున ఖర్గే, రాహుల్ భేటీ..!
ఆర్థిక వ్యవస్థలో అన్ని స్థాయిలలో ఈ ఉద్యోగాల కోతలు ఒకే విధంగా ఉండవని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, కార్యాలయ పనుల్లో 45 శాతం, న్యాయ వృత్తిలో 44 శాతం ఆటోమేట్ అయ్యే అవకాశం ఉందని, కానీ నిర్మాణ రంగంలో కేవలం 6 శాతం, నిర్వహణలో 4 శాతం మాత్రమే ఆటోమేట్ అవుతాయని తెలిపింది. ఏఐ రాకతో ఉత్పత్తి పుంజుకుంటోందని, వృద్ధి నమోదవుతుందని, కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కూడా గోల్డ్‌మ్యాన్ శాక్స్ రిపోర్టు వెల్లడించింది. ఇప్పటికే దీనిపై కొన్ని నిర్ధారణలున్నాయి.
READ MORE:CM Chandrababu: సీఎం క్షేత్రస్థాయి పర్యటన.. పరుగులు పెట్టిన భద్రతా సిబ్బంది, అధికారులు..
ఐకియానే ఉదాహరణ
2021 నుంచి తన కాల్ సెంటర్లలో పనిచేసే 8,500 మందికి డిజైన్ కన్సల్టెంట్లుగా శిక్షణ ఇచ్చినట్లు ఈ నెలలో ఐకియా తెలిపింది. ప్రస్తుతం 47 శాతం కస్టమర్ కాల్స్‌ను బిల్లీ అనే ఏఐ నిర్వహిస్తుందని ఈ ఫర్నీచర్ కంపెనీ చెప్పింది. అయితే, ఏఐ వాడకం ఫలితంగా ఎన్ని ఉద్యోగాలు పోతాయో మాత్రం ఇంకా ఐకియా అంచనావేయలేదు. కానీ, కంపెనీలోని ఈ పరిణామాల విషయంలో చాలా మంది ఉద్యోగులు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు.