7.78mm స్లిమ్ డిజైన్, Dimensity 7100 ప్రాసెసర్‌తో ఫిబ్రవరి 18న రానున్న Infinix Note Edge 5G!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix Note Edge 5G: ఇన్ఫినిక్స్ (Infinix) నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ నోట్ ఎడ్జ్ 5G (Note Edge 5G)కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించింది. గత నెల గ్లోబల్ మార్కెట్లో పరిచయమైన ఈ ఫోన్‌ను భారత్‌లో ఫిబ్రవరి 18న లాంచ్ చేయనుంది. ఈ డివైస్‌కు బ్రాండ్ అంబాసడర్‌గా క్రికెటర్ ‘యశస్వి జైస్వాల్’ వ్యవహరించడం విశేషం.
డిస్‌ప్లే & డిజైన్:
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దాని స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్. ఇన్ఫినిక్స్ ప్రకారం ఇది తన సెగ్మెంట్‌లోనే అత్యంత సన్నని ఫోన్‌గా 7.78mm మందంతో వస్తోంది. వీటితోపాటు..
* 3D కర్వ్డ్ 1.5K AMOLED డిస్‌ప్లే
*కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ
*TUV Rheinland లో బ్లూ లైట్ సర్టిఫికేషన్
* డిజైన్ పరంగా ప్రీమియమ్ లుక్ ఇవ్వడానికి లూనార్ టైటానియం, స్టెల్లార్ బ్లూ, సిల్క్ గ్రీన్ (వీగన్ లెదర్ ఫినిష్‌తో ప్రత్యేక డిజైన్) మూడు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది.
Also Read
- Samsung Galaxy A27 5G: 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 2032 వరకు సాఫ్ట్‌వేర్ అప్డేట్ల హామీ!
- 200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
- Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోండి!
- China Robot: చైనా రోబోలు.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
పనితీరు & హార్డ్‌వేర్:
ఈ కొత్త నోట్ ఎడ్జ్ 5Gలో MediaTek Dimensity 7100 చిప్‌సెట్‌ను వినియోగించారు. ఈ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్న భారత్‌లో తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. అలాగే ఇది 7,50,000 పైగా AnTuTu స్కోర్, గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచేందుకు “AI Powers Your Play” పేరిట ప్రత్యేక ఫీచర్లు అందిస్తున్నారు.
కెమెరా & బ్యాటరీ:
* 50MP మెయిన్ రియర్ కెమెరా
* 13MP ఫ్రంట్ కెమెరా
* 6500mAh భారీ బ్యాటరీ
* 45W ఫాస్ట్ ఛార్జింగ్
* 10W రివర్స్ ఛార్జింగ్
* దీంతో పాటు వెనుక భాగంలో RGB హలొ లైట్ నోటిఫికేషన్ లేదా స్టేటస్ ఇండికేటర్‌గా పనిచేస్తుంది.
ఆడియో & డ్యూరబిలిటీ:
* డ్యూయల్ స్పీకర్స్ విత్ జేబుల్ సౌండ్
* IP55 రేటింగ్ (డస్ట్ & స్ప్లాష్ ప్రొటెక్షన్)
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G భారత్‌లో ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల కానుంది. ఈ ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Mohanlal New Movie Update: ‘మంజుమ్మెల్ బాయ్స్’ డైరెక్టర్ తో లాలేట్టన్ మూవీ… అసలు నిజం ఇదే!
-
Aprilia SR 175: కొత్త థీమ్‌తో విడుదలైన ఏప్రిలియా SR 175.. ప్రత్యేక మ్యాట్ గ్రీన్ ఎడిషన్ ధర, ఫీచర్లు ఇవే!
-
Peddi : భారీ నష్టాల దిశగా పెద్ది.. ఓవర్సీస్ దాదాపు వాషౌట్?
-
Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్‌పై హిట్‌మ్యాన్ ఫైర్!
-
Samsung Galaxy A27 5G: 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 2032 వరకు సాఫ్ట్‌వేర్ అప్డేట్ల హామీ!
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!