6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huawei Mate 90 Air: హువావే (Huawei) నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ Mate 90 Airను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. స్లిమ్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ కేవలం 6.58mm మందం, 208 గ్రాముల బరువుతో ఆకట్టుకుంటోంది. ఇందులో 7 అంగుళాల 1.5K డిస్ప్లే, Kirin 9020 ప్రాసెసర్, 6500mAh బ్యాటరీని అందించారు. ఈ మొబైల్ మందం 6.58mm కాగా, మిడ్ ఫ్రేమ్ మందం కేవలం 3.7mm మాత్రమే. బరువు 208 గ్రాములు. ఇప్పటివరకు విడుదల చేసిన Mate సిరీస్ బార్ ఫోన్లలో ఇదే అత్యంత సన్నని మోడల్. ఇందులో 7 అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160Hz PWM డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో Mate 90 సిరీస్ డిజైన్‌ను పోలిన సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది.
ఈ ఫోన్లో Kirin 9020 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇందులోని మెమరీ టెక్నాలజీ వల్ల 12GB RAM, కొన్ని బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌లలో 16GB RAM స్థాయిలో పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ విషయానికి వస్తే 6500mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 23 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంది.
Also Read
- 2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
- Motorola Edge 70 Neo 5G: మోటరోలా Edge 70 Neo 5G లాంచ్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే.. ధర ఎంతంటే?
- Red Bra, Blood and Nvidia Flag: చేతిలో బ్రా.. ముఖంపై రక్తపు మరకలు!.. జెన్సన్ హువాంగ్‌పై ట్రంప్ AI పోస్ట్ వైరల్
- Jwala MK-1: శత్రు డ్రోన్లకు ఇక చెక్! భారత్ జ్వాలా MK-1 పరీక్ష సక్సెస్.. ప్రత్యేకతలు ఇవే!
వెనుకవైపు నాలుగు కెమెరా సెన్సార్లు ఉన్నాయి. OIS సపోర్ట్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ మాక్రో లెన్స్, OISతో కూడిన 12MP 3x టెలిఫోటో కెమెరాను అందించారు. వీటితో పాటు 1.5 మిలియన్ మల్టీస్పెక్ట్రల్ ఛానళ్లతో పనిచేసే Red Maple కలర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 10.7MP కెమెరాను ఇచ్చారు. ఇంకా ఇందులో 5A సెల్యులార్ స్పీడ్స్, Wi-Fi 7+, NearLink కనెక్టివిటీ ఉన్నాయి. అంతేకాకుండా రెండు వైపులా పనిచేసే BeiDou శాటిలైట్ మెసేజింగ్ సదుపాయాన్ని కూడా అందించారు.
ఈ ఫోన్ రోజ్ గోల్డ్, మూన్ సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. రెండు స్టోరేజ్ వేరియంట్ల ధరలను హువావే ప్రకటించింది. 12GB + 256GB వేరియంట్ ధర CNY 4,999 (సుమారు $750) కాగా, 12GB + 512GB వేరియంట్ ధర CNY 5,999 (సుమారు $901)గా నిర్ణయించారు. చైనాలో నవంబర్ 24న సాయంత్రం 6:08 గంటలకు ప్రీ-సేల్స్ ప్రారంభమవుతాయి. డిసెంబర్ 4న ఉదయం 10:08 గంటల నుంచి సాధారణ అమ్మకాలు మొదలవుతాయి. భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ విడుదలపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు.. టీవీకే ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్..!
-
Hyderabad Green Tankers: గ్రీన్ ట్యాంకర్ల పేరుతో మురుగు నీటి సరఫరా కలకలం.. ఖాజాగూడలో ఏం జరుగుతోంది?
-
Punjab BJP-SAD Alliance 2027: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. మళ్లీ చేతులు కలిపిన బీజేపీ-అకాలీదళ్!
-
AP Panchayat Elections: ఏకగ్రీవాలపై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
ట్రెండింగ్
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!