Tech Tips : ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం మిలియన్ల మంది ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌ను ఉపయోగిస్తుంటారు. కానీ పాస్‌వర్డ్ మర్చిపోవడం సాధారణ సమస్యే. ఈ సందర్భంలో కొత్త అకౌంట్ క్రియేట్ చేయడం కంటే, ఇప్పటికే ఉన్న ఖాతాకు ‘పాస్‌వర్డ్ రీసెట్’ ఆప్షన్‌ను ఉపయోగించడం చాలా సులభం. IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీరు కేవలం 5 స్టెప్స్‌లో పాస్‌వర్డ్ మార్చుకోవచ్చు.
Paraspeak: ఇండియన్ విద్యార్థి సంచలన సృష్టి.. డిసార్థ్రియా రోగులకు కొత్త ఆశ
IRCTC పాస్‌వర్డ్ రీసెట్ చేయడానికి 5 స్టెప్స్
1. IRCTC వెబ్‌సైట్ ఓపెన్ చేయండి : ముందుగా బ్రౌజర్‌లో www.irctc.co.in వెబ్‌సైట్‌కి వెళ్ళండి. అక్కడ లాగిన్ సెక్షన్‌లో ‘Forgot account details?’ అనే లింక్ కనిపిస్తుంది.
2. యూజర్ ఐడి లేదా రిజిస్టర్డ్ ఇమెయిల్ ఎంటర్ చేయండి : ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీ IRCTC యూజర్ ఐడి లేదా రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్ ను నమోదు చేయాలి.
3. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ‘Next’ క్లిక్ చేయండి : క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి, తర్వాత ‘Next’ బటన్‌పై క్లిక్ చేయండి.
4. OTP ద్వారా వెరిఫై చేయండి : మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌కి OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
5. కొత్త పాస్‌వర్డ్ సెట్ చేయండి : తర్వాత కొత్త పాస్‌వర్డ్ సెట్ చేసి, ‘Update Password’ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కొత్త పాస్‌వర్డ్‌తో IRCTC ఖాతాలో సులభంగా లాగిన్ కావచ్చు.
గమనికలు:
Amazon: అమెజాన్ కొత్త గేమ్ ప్లాన్.. Alexaలో Bee AI టెక్నాలజీ