How to Create your people card on Google Search: గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్. ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు, వెంటనే గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి సెర్చ్ చేస్తాం. ఎక్కువ సెలబ్రిటీల గురించే చర్చిస్తాం కానీ గూగుల్‌లో తమ గురించి కూడా ఉంటే బాగుండు అని చాలా మందికి ఉంటుంది. అయితే అలా ఉండాలంటే దానికి సెలబ్రిటీనే అవ్వాల్సిన అవసరం లేదు. Googleలో మిమ్మల్ని మీరు ఎలా యాడ్ చేసి సెర్చ్ లో కనిపించచ్చో ఇక్కడ మేకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మీరు పేరు, స్థానం, విద్య అలాగే గురించి సమాచారాన్ని అందించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ పేరు కూడా సెలబ్రిటీల మాదిరిగానే Googleలో కనిపిస్తుంది.
గూగుల్ లో మిమ్మల్ని మీరు యాడ్ చేసుకోవాలి అంటే కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాలి.
ముందుగా Google సెర్చ్ ఓపెన్ చేయండి
అక్కడ మీరు Add to me google అని సెర్చ్ చేయాలి.
మీ Gmail Googleకి లాగిన్ చేయబడిందని నిర్ధారించుకోండి.
ఇప్పుడు మీరు స్టార్ట్ అనే ఆప్షన్ తీసుకుని మీ పేరు, వృత్తి మరియు స్థానంతో పాటు ఇతర సమాచారాన్ని నమోదు చేయాలి.
ఈ సమాచారాన్ని ఫిల్ చేసిన తర్వాత, ప్రివ్యూ ఎంపిక కనిపిస్తుంది.
ఇక్కడ నుండి మీరు సృష్టించిన పేజీ మీకు కనిపిస్తుంది.
అన్నీ సరిగ్గా ఉంటే, దానిని Googleకి సబ్మిట్ చేయాలి.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ పేరు Googleలో యాడ్ అయినట్టే.
ఇక గూగుల్ అందించే ఈ ఫీచర్ భారత్, కెన్యా, నైజీరియా మరియు దక్షిణాఫ్రికాలోని వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది కాకుండా, హిందీ లేదా ఆంగ్ల భాషను సెట్ చేసిన వారు దీన్ని కూడా పొందుతారు. మీరు సృష్టించిన పేజీ ఇక్కడ కనిపిస్తుంది అని Google స్పష్టంగా చెప్పడం గమనించదగ్గ విషయం, కాబట్టి మీరు పేజీలో వీలైనంత ఎక్కువ సమాచారాన్ని పూరించాలి. తద్వారా మీ పేజీని సందర్శించే అవకాశాలు పెరుగుతాయి.