Honor X7c 5G: IP64 రేటింగ్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో కొత్త హానర్ స్మార్ట్ ఫోన్ లాంచ్!
- భారత మార్కెట్లో కొత్త Honor X7c 5G స్మార్ట్‌ఫోన్ విడుదల.
- 6.8 అంగుళాల FHD+ TFT LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.
- 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,999.
- డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో పాటు 300 శాతం హై-వాల్యూమ్ మోడ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor X7c 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ భారత మార్కెట్లో తన కొత్త Honor X7c 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. అమెజాన్ ద్వారా మాత్రమే విక్రయించబడే ఈ మొబైల్ పై కంపెనీ ప్రత్యేక లాంచ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. Honor X7c 5G మొబైల్ అధికారిక ధర ఇంకా ప్రకటించలేదు.
అయితే, ఆగస్టు 20న ప్రత్యేక ప్రారంభ ఆఫర్ కింద ఈ ఫోన్ రూ.14,999 ధరలో లభ్యం కానుంది. ఈ మొబైల్ కేవలం 8GB RAM + 256GB స్టోరేజ్ ఒకే వేరియంట్ మాత్రమే అందించబడుతోంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు నో-కాస్ట్ EMI (6 నెలల వరకు) ఆప్షన్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, మూన్ లైట్ వైట్ రెండు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
Also Read
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max

Redmi 15 5G: నేడు భారత మార్కెట్లో విడుదల కానున్న రెడ్మీ 15.. ధర, ఫీచర్లు ఇవే..!
Honor X7c 5G మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా MagicOS 8.0 తో నడుస్తుంది. ఇందులో 6.8 అంగుళాల FHD+ TFT LCD డిస్ప్లే (2,412×1,080 పిక్సెల్స్) 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 850 nits బ్రైట్నెస్ సపోర్ట్‌తో లభిస్తుంది. ఫోన్‌ను 4nm Snapdragon 4 Gen 2 చిప్సెట్ ను ఉపయోగించారు. దీనికి Adreno 613 GPU కూడా తోడవుతుంది. ఇక మెమరీ పరంగా, ఇది 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో పాటు 300 శాతం హై-వాల్యూమ్ మోడ్ ఉంటుంది. ఇది అవుట్డోర్ వినియోగంలో మెరుగైన సౌండ్‌ను అందించనుందని కంపెనీ చెబుతోంది.

ఇక కెమెరా విభాగంలో, Honor X7c 5Gలో 50MP f/1.8 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ కలిగిన డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది LED ఫ్లాష్ కూడా అమర్చబడింది. ఈ మొబైల్ లోని కెమెరాలు Portrait, Night, Aperture, PRO, Watermark, HDR వంటి మోడ్లకు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం 5MP f/2.2 ఫ్రంట్ కెమెరా హోల్-పంచ్ కటౌట్లో ఇవ్వబడింది.
Mithun Chakraborty : 45 కోట్ల విలాస భవంతిని కుక్కల కోసం డొనేట్ చేసిన స్టార్ హీరో !
ఈ కొత్త ఫోన్లో 5,200mAh బ్యాటరీ అమర్చబడి ఉంది. ఇది 35W SuperCharge వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ప్రకారం ఈ బ్యాటరీతో 24 గంటల ఆన్లైన్ స్ట్రీమింగ్, 18 గంటల షార్ట్ వీడియో ప్లేబ్యాక్, 59 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 46 గంటల కాలింగ్ సౌకర్యం పొందవచ్చు. అంతేకాకుండా Ultra Power-Saving Mode ద్వారా కేవలం 2% బ్యాటరీతో కూడా 75 నిమిషాల వాయిస్ కాల్ చేయవచ్చు.
ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. Honor X7c 5Gకి IP64 రేటింగ్ ఉంది. ఇది డస్ట్, స్ప్లాష్ ప్రూఫ్ కేటగిరీలో వస్తుంది. కనెక్టివిటీ కోసం డ్యుయల్-బ్యాండ్ Wi-Fi, Bluetooth 5.0, GPS, AGPS, GLONASS, BeiDou, Galileo సపోర్ట్ లభిస్తుంది. మొత్తానికి బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, 5G సపోర్ట్, తక్కువ ధరలో Honor X7c 5G మధ్యస్థాయి స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో వినియోగదారులను ఆకట్టుకోబోతుంది.
తాజావార్తలు
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?