Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Homemade Besan Biscuits Recipe: టీతో పాటు బిస్కెట్లు నంజుకుని తింటే ఆ మజానే వేరు! సాధారణంగా మనం బయట షాపుల్లో కొని తెచ్చుకుంటూ ఉంటాం. కానీ, ఎలాంటి కేక్ మేకింగ్ మిషన్లు అవసరం లేకుండానే ఇంట్లోనే చాలా ఈజీగా క్రిస్పీగా, టేస్టీగా ఉండే “శనగపిండి బిస్కెట్లు” (బేసన్ బిస్కెట్స్) తయారు చేసుకోవచ్చు. శనగపిండి, నెయ్యి, చక్కెర, కాస్త బొంబాయి రవ్వ, మిల్క్ పౌడర్ కలగలిపి చేసే ఈ బిస్కెట్లు భలే కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. మీ దగ్గర మైక్రోవేవ్ ఓవెన్ ఉన్నా సరే, లేకపోయినా సరే.. ఇంట్లో ఉండే కడాయిలోనే వీటిని హాయిగా బేక్ చేసుకోవచ్చు. పైన కాస్త పిస్తా, బాదం ముక్కలు చల్లుకుంటే చూడటానికి, తినడానికి బేకరీ స్టైల్లో అదిరిపోతాయి. మరి ఈ టేస్టీ బేసన్ బిస్కెట్లకు ఏమేం కావాలి? ఎలా తయారు చేయాలో చూద్దాం!
కావలసిన పదార్థాలు:
శనగపిండి – 1 కప్పు
వెన్న లేదా దేశీ నెయ్యి – 1/4 కప్పు
పంచదార పొడి – 1/4 కప్పు
బొంబాయి రవ్వ (సూజీ) – 2 పెద్ద స్పూన్లు
మిల్క్ పౌడర్ – 2 చిన్న స్పూన్లు
బేకింగ్ పౌడర్ – 1/8 చిన్న స్పూను
బేకింగ్ సోడా – 1/8 చిన్న స్పూను
యాలకుల పొడి – 1/2 చిన్న స్పూను
వెనిల్లా ఎసెన్స్ – 3 నుండి 4 చుక్కలు
పాలు – 2 నుంచి 3 పెద్ద స్పూన్లు
సన్నగా తరిగిన పిస్తా, బాదం ముక్కలు – గార్నిష్ కోసం
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
తయారీ విధానం:
ముందుగా ఒక పెద్ద బౌల్లో రూమ్ టెంపరేచర్ దగ్గర మెత్తగా ఉన్న వెన్న (లేదా నెయ్యి), పంచదార పొడి వేసి బాగా కలపాలి. ఇది క్రీమ్‌లా, స్మూత్‌గా అయ్యేంత వరకు కొన్ని నిమిషాల పాటు విస్క్ చేయాలి. ఇప్పుడు మరొక బౌల్లో శనగపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మిల్క్ పౌడర్లను జల్లెడ పట్టుకోవాలి. ఇందులో బొంబాయి రవ్వ, యాలకుల పొడి వేసి తేలిగ్గా కలపాలి. ఆ తర్వాత వెనిల్లా ఎసెన్స్ కూడా చేర్చి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పొడి మిశ్రమాన్ని మనం ముందే సిద్ధం చేసుకున్న వెన్న-పంచదార క్రీమ్‌లో వేసి, చేతితో మెల్లగా కలుపుతూ బ్రెడ్ పొడి (Bread crumbs) మాదిరిగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దికొద్దిగా పాలు పోస్తూ మెత్తటి పిండి ముద్దలా చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా గానీ, మరీ పల్చగా గానీ ఉండకూడదు. పిండి ముద్దపై మూత పెట్టి ఒక 2 నుంచి 5 నిమిషాలు పక్కన ఉంచాలి. ఆ తర్వాత పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగాన్ని చపాతీ పీటపై బటర్ పేపర్ పరిచి, దానిపై ఉంచి తేలిగ్గా, కాస్త మందంగా ఒత్తుకోవాలి. మీకు నచ్చిన షేప్‌లో బిస్కెట్లలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన బిస్కెట్ల పైన సన్నగా తరిగిన పిస్తా, బాదం ముక్కలు పెట్టి ఊడకుండా తేలిగ్గా నొక్కాలి. మిగతా పిండితో కూడా ఇలాగే బిస్కెట్లు తయారు చేసుకోవాలి.
ఓవెన్లో బేక్ చేసే విధానం:
ఓవెన్‌ను ముందుగా 160 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రీ-హీట్ చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న బిస్కెట్లను బేకింగ్ ట్రేలో ఉంచి, దాదాపు 10 నిమిషాల పాటు బేక్ చేయాలి. ఓవెన్ నుంచి తీసాక బిస్కెట్లను పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే విరిగిపోయే ప్రమాదం ఉంది.
కడాయిలో (స్టవ్ మీద) బేక్ చేసే విధానం:
మందపాటి కడాయిలో అడుగున కాస్త ఉప్పు వేసి, మూతపెట్టి మీడియం మంట మీద బాగా వేడెక్కనివ్వాలి. కడాయి వేడెక్కాక లోపల ఒక చిన్న స్టాండ్ ఉంచి, దానిపైన బటర్ పేపర్ పరిచిన ప్లేట్లో బిస్కెట్లు పెట్టి ఉంచాలి. మూతపెట్టి చిన్న మంట (Low Flame) మీద 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేయాలి. బిస్కెట్లు లేత బంగారు రంగులోకి రాగానే గ్యాస్ ఆపేయాలి. ఇవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే ప్లేట్ నుంచి తీయాలి. అంతే! కరకరలాడే హోమ్మేడ్ బేసన్ బిస్కెట్స్ రెడీ. ఇవి పూర్తిగా చల్లారాక గాలి చొరబడని డబ్బా (Air-tight container)లో భద్రపరుచుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. సాయంత్రం వేడి వేడి టీ లేదా కాఫీతో వీటిని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే!
తాజావార్తలు
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?