First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడా సూపర్ 60 టోర్నమెంట్లో టొరంటో సిక్సర్స్, మిస్సిసావుగా మాస్టర్స్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అమెరికా పేసర్ అలీ ఖాన్ వేసిన ఒక బౌన్సర్ ఊహించని రీతిలో వికెట్ కీపర్, బ్యాటర్ అయిన కీరన్ పొలార్డ్ తలల మీదుగా ఎగిరి నేరుగా బౌండరీ లైన్ దాటి సిక్సర్‌గా వెళ్లడం అందరినీ విస్మయానికి గురిచేసింది. సాధారణంగా ఇలాంటి బంతులు కీపర్ వెనుక పడతాయి, కానీ ఈ బంతి మాత్రం ఎక్కడా టచ్ కాకుండా గాల్లోనే ఎగురుతూ బౌండరీ దాటింది.
ఈ విచిత్రమైన ఘటనకు వాంకోవర్‌లోని బిసి ప్లే స్టేడియంలో ఉన్న చిన్న మైదానమే ప్రధాన కారణం. ఇక్కడ బౌండరీలు దాదాపు 45 మీటర్ల చిన్న పరిమాణంలో ఉండటంతో, బంతి తక్కువ దూరం ప్రయాణించి బౌండరీని తాకగలిగింది. అయితే.. వైడ్ బంతి బౌండరీ దాటినప్పుడు ఏడు పరుగులు రావాలి కదా అనే సందేహం కలగడం సహజం. వైడ్ రూపంలో ఒక పరుగు, బౌండరీకి నాలుగు పరుగులు కలిపి మొత్తం ఐదు పరుగులు మాత్రమే రావడానికి క్రికెట్ నిబంధనలే కారణం.
Also Read
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
🚨 MAYBE FIRST TIME IN CRICKET HISTORY 🚨
Ali Khan bowls a bouncer, and the ball goes for a SIX 😳
That’s a Wide + Six, possibly the first time this has happened in cricket history 😂
A must watch 👇🏻 https://t.co/6QACwUgT2T
— Richard Kettlebourogh Fans (@RichKettle07) October 5, 2026
A historic wide with a six from the bowler in Canada Super60. 🤣 https://t.co/8YHNJTRs78
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2026
ఎంసీసీ (MCC) లా 22 ప్రకారం.. వైడ్ బంతికి ఒక పెనాల్టీ రన్ లభిస్తుంది. అలాగే బ్యాట్ తాకకుండా వైడ్ బంతి బౌండరీ దాటితే అదనంగా నాలుగు పరుగుల బౌండరీ అలవెన్స్ ఇస్తారు. అయితే, బ్యాట్‌తో కొట్టకుండా గాల్లో నేరుగా బౌండరీ దాటినంత మాత్రాన దాన్ని ఆటోమేటిక్‌గా సిక్సర్‌గా పరిగణించరు. ఎంసీసీ లా 19 ప్రకారం.. బ్యాట్ తాకకుండా బౌండరీకి వెళ్లే ఏ బంతికైనా గరిష్టంగా నాలుగు పరుగులు మాత్రమే కేటాయిస్తారు. అందుకే ఈ అరుదైన బౌన్సర్‌కు బ్యాటింగ్ జట్టుకు ఏడు పరుగులు కాకుండా కేవలం ఐదు పరుగులు మాత్రమే లభించాయి.
తాజావార్తలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?