ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు ఇటీవల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించడం, దాని వల్ల జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేయడం వంటి పరిణామాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తన పెద్ద మనసును చాటుకున్నారు.
Also Read : Sridevi : ఇలాంటి రోల్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేశా – శ్రీదేవి
తొలి నుంచి జంతు ప్రేమికుడిగా పేరొందిన మిథున్, తనకున్న కుక్కలపై మమకారాన్ని మరింత బలంగా చాటుతూ, 116 కుక్కలను దత్తత తీసుకున్నారు. వాటి కోసం ఆయన ముంబైలోని ఒక ద్వీపంలో ఉన్న తన విలాసవంతమైన 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవనాన్ని పూర్తిగా కుక్కల కోసం కేటాయించారు. ఈ భవనంలో వాటి కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పించడమే కాకుండా, సంరక్షకులను నియమించారు. కుక్కలు ఆడుకునే ప్రదేశాలను, ఆహారం, ఆరోగ్యం, భద్రత కోసం అవసరమైన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు.
ఈ భవన విలువ అక్షరాలా రూ. 45 కోట్ల రూపాయలు. ఇంత విలువైన ఆస్తిని మూగజీవాల కోసం కేటాయించడం ఆయన పెద్దమనసుకు నిదర్శనం. సాధారణంగా జంతువులపై ఇంత మమకారం చూపించడం అరుదు. అయితే మిథున్ మాత్రం వాటిని తన కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. ఇటీవల ఆయనకు భారతీయ సినీ రంగ అత్యున్నత గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఇక జంతు ప్రేమికుడిగా తీసుకున్న ఈ నిర్ణయం, ఆయనకు మరో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. సమాజంలో జంతువులను నిర్లక్ష్యం చేస్తూ తరచూ సమస్యలుగా చూస్తారు. కానీ మిథున్ చక్రవర్తి చూపిన ఈ మానవత్వం, జంతువుల పట్ల ఉన్న ప్రేమ ఒక ఆదర్శంగా నిలుస్తోంది.