Trent Share: స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ రెడ్ జోన్‌లో ఉన్నాయి. ఈ రోజు మార్కెట్ ప్రారంభమైన వెంటనే ట్రెంట్ షేర్లు కుప్పకూలాయి. ఈ స్టాక్ ధరలు అకస్మాత్తుగా 8% కంటే ఎక్కువ పడిపోయాయి. దీంతో ప్రముఖ పెట్టుబడిదారు రాధా కిషన్ దమాని కేవలం రెండు నిమిషాల్లో రూ.162 కోట్లు కోల్పోయి అతిపెద్ద దెబ్బను చవిచూశారు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం.
READ ALSO: PVC Aadhar Card: ఆధార్ వినియోగదారులకు అలెర్ట్.. ఆధార్ PVC కార్డ్ ధర పెంపు..!
కుప్పకూలిన టాటా షేర్..
మంగళవారం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే ట్రెంట్ షేర్లు 8% కంటే ఎక్కువ పడిపోయాయి. ట్రెంట్ స్టాక్ అనేది టాటా గ్రూప్ రిటైల్ యూనిట్, ఇది మంగళవారం మార్కెట్ స్టార్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే భారీ అమ్మకాలను చవిచూసింది. NSE డేటాను పరిశీలిస్తే, ట్రెంట్ లిమిటెడ్ షేరు ఈ రోజు రూ.4208 వద్ద ప్రారంభమైంది, దాని మునుపటి ముగింపు ధర రూ.4417 నుంచి గణనీయంగా పడిపోయింది, ఆపై అకస్మాత్తుగా రూ.4060కి పతనం అయ్యింది. ట్రేడింగ్ ప్రారంభమైన రెండు నిమిషాల్లో ఇది 8.35% పతనం అయ్యింది. ఈ షేరు పతనం కారణంగా, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పడిపోయింది.
ప్రముఖ పెట్టుబడిదారుడు, దేశంలోని అత్యంత ధనవంతులైన బిలియనీర్లలో ఒకరైన రాధాకిషన్ దమానీ తన పెట్టుబడి సంస్థ డ్రైవ్ ట్రేడింగ్ & రిసార్ట్స్ ద్వారా ట్రెంట్‌లో 43,98,204 ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. ఈ షేర్ల సంఖ్య ఆయన కంపెనీలో 1.24% వాటాను కలిగి ఉంది. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్ సమయంలో ఈ టాటా స్టాక్ పతనంతో కారణంగా కేవలం రెండు నిమిషాల్లోనే ఆయన తన వాటా విలువ నుంచి రూ.162.65 కోట్లు కోల్పోయారు. రూ.1,948.32 కోట్ల నుంచి ఆయన వాటా విలువ రూ.1,785.67 కోట్లకు పడిపోయింది. ట్రెంట్ షేర్లలో క్షీణతకు గల కారణాల విషయాన్ని పరిశీలిస్తే, ఈ కంపెనీ బలమైన వృద్ధిని నమోదు చేస్తూనే ఉన్నప్పటికీ, వార్షిక ఆదాయ వృద్ధి గత మూడు నెలలతో పోలిస్తే ఎటువంటి మెరుగుదల చూపలేదు. ఇది కొంతమంది పెట్టుబడిదారులను లాభాలను బుక్ చేసుకోవడానికి ప్రేరేపించింది. దీంతో ఈ షేర్ భారీగా పతనం అయ్యిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Pawan Kalyan: స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్