Google Incognito Mode Has A New Disclaimer : తాజాగా గూగుల్‌కు 5 బిలియన్ డాలర్ల జరిమానా విధించారు. క్రోమ్ బ్రౌజర్‌లోని అజ్ఞాత మోడ్‌లో వినియోగదారులను ట్రాక్ చేసినందుకు గూగుల్‌కు ఈ జరిమానా విధించబడిందని తెలుస్తోంది. మామూలుగా గూగుల్ సెర్చ్ చేసే వ్యక్తులు కొందరు ఇన్ కాంగింటో మోడ్‌లో ఇంటర్నెట్‌ను సర్ఫ్ చేస్తాడు, తద్వారా తన సెర్చ్ హిస్టరీ ట్రాక్ చేయబడదని భావిస్తూ ఉంటారు. అంతేకాక వారు సందర్శించే వెబ్‌సైట్‌లో కుక్కీలు కూడా నిల్వ చేయకూడదు. అయితే Google తన కస్టమర్ లను మోసం చేసింది. ఇంటర్నెట్‌ను ప్రైవేట్‌గా బ్రౌజ్ చేస్తున్నట్లు భావించిన వినియోగదారుల డేటాను ట్రాక్ చేసిన ఆరోపణలపై $5 బిలియన్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఒక పిటిషన్ వేయగా ఇప్పుడు ఆ డబ్బు కట్టేందుకు గూగుల్ అంగీకరించింది.
Viral Video : థాయ్ ఎయిర్ ఏషియా బ్యాంకాక్-ఫుకెట్ విమానంలో పాము..వీడియో వైరల్..
ఇక ఈ జరిమానా చెల్లించిన తర్వాత Google తన విధానాన్ని మార్చుకుందని MSPowerUser రిపోర్ట్ పేర్కొంది. ఇప్పుడు ఎవరైనా అజ్ఞాత మోడ్‌లో ట్రాక్ చేయబడితే, ఆ వినియోగదారులందరికీ Google హెచ్చరిక జారీ చేస్తోంది. ఇప్పటిదాకా ఎలాంటి హెచ్చరికలు ఉండేవి కాదు కానీ ఇప్పుడు ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయవచ్చు అయితే మీ యాక్టివిటీ మీరు వాడే వెబ్ సైట్, మీ ఆఫీస్ లేదా కాలేజ్ యాజమాన్యం, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లకి కనిపిస్తుందని పేర్కొంటోంది. అజ్ఞాత మోడ్‌లో వినియోగదారులను ట్రాక్ చేయడంపై 2020లో Googleపై దావా వేయబడింది, తుది నిర్ణయం ఫిబ్రవరి 2024లో రాబోతోంది.