మోసగాళ్ళు రోజుకో ఐడియాతో మోసాలకు తెగబడుతున్నారు. ఆర్డర్ ఇవ్వకుండా మీకు పార్సల్ వచ్చింది అని ఎవరైనా వస్తే అది ఖచ్చితంగా స్కామ్ అని గుర్తించండి. క్యాన్సిల్ చెయ్యడానికి OTP అడిగితే చెప్పకండి. జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇదో కొత్తరకం మోసం.. ఆదమరిస్తే అంతే సంగతులు. మీరు ఈ కామర్స్ వెబ్ సైట్లలో ఏవైనా వస్తువులు కొంటుంటారు. అవి మీ ఇంటికి డెలివరీ అవుతాయి. ఇదంతా కామన్.. కానీ ఇప్పుడు మోసగాళ్ళు మనం ఆర్డర్ చేయకుండానే మనకు వస్తువులు డెలివరీ చేసేస్తారు. మీరు క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే చాలంటారు… అక్కడే మతలబు వుంది. మీరు క్యాష్ ఇస్తే వాళ్ళు తీసుకోరు.
Komatireddy Rajagopal Reddy Press Meet Live: కోమటిరెడ్డి రాజీనామా…!
వాళ్ళు తమ దగ్గర వున్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయమంటారు. అంతే మనం ఆ క్యూర్ కోడ్ స్కాన్ చేశామా.. మన ఖాతాకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆ మోసగాళ్ళు తస్కరిస్తారు. మన అకౌంట్లో మనకు కనిపించేది గుండు సున్నా మాత్రమే. మీరు ఇంతకుముందు ఎప్పుడూ ఆర్డర్ చేయని వస్తువుల గురించి వాళ్ళు చెబుతారు. ఉదాహరణకు హెయిర్ క్లిప్ లు, క్రీంలు, సౌందర్య సాధనాలు, సన్ గ్లాసెస్, చిన్న చిన్న బాక్స్ లు, హాట్ బాక్స్ లు, తక్కువ మొత్తంలో వుండే వివిధ వస్తువులు ఈ జాబితాలో వుంటాయి.
100, 200, 3వందలు.. ఇలా తక్కువ మొత్తమే వుంటుంది. మనం తక్కువ మొత్తమే కదా అని స్కాన్ చేసి పేమెంట్ చేసేస్తాం. అంతే ఆ క్యూ ఆర్ కోడ్ నుంచి మన అకౌంట్లో ఎంత మొత్తం వుందో మోసగాళ్ళు పసిగట్టేస్తారు. అంతే.. మన అకౌంట్ ఖల్లాస్ అయిపోతుంది. తర్వాత మనం ఎంత మొత్తుకున్నా అది మనకు తిరిగి రావడం అనేది అనుమానమే.
ఇలాంటి మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా వుండాలని సైబర్ క్రౌం పోలీసులు చెబుతున్నారు.మీరు ప్యాకేజ్ తీసుకోకుంటే.. ఆర్డర్ క్యాన్సిల్ చేయమంటారు. మన డెబిట్/క్రెడిట్ కార్డుల వివరాలు అడుగుతారు. ఓటీపీ చెప్పండి.. క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతాం అంటారు. మీరు ఆ మాటలకు లొంగితే అంతే సంగతులు. కనీసం కొంతమొత్తం అయినా పేమెంట్ చేయమంటారు. మనం ఊ అంటే అంతే.. కాసేపట్లో మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. మీకు కన్నీళ్ళు మిగులుతాయి.
మీకు ఏమైనా అనుమానాలుంటే.. dcp-dd-hyd@tspolice.gov.in, 040-27852412కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.