Apple WWDC 2022 ఈవెంట్ త్వరలోనే జరగనున్న నేపథ్యంలో.. ఆ సంస్థ ఎలాంటి ఎలాంటి అప్డేట్స్‌తో ముందుకు రానుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మొత్తానికి అంచనాలకి తగినట్టుగానే యాపిల్ సంస్థ ఐఫోన్‌ల కోసం ఐఓఎస్ 16 అప్డేట్‌ను తీసుకురానుంది. నోటిఫికేషన్స్ దగ్గర నుంచి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్‌కు ఈ కొత్త అప్డేట్ ఉపకరిస్తుందని తెలుస్తోంది. గత వర్షన్స్ కంటే ఈ కొత్త వర్షన్ మరింత మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది. కాకపోతే.. విజువల్లీ ఇది ఐఓఎస్ 15నే పోలి ఉంటుందట! ఆల్వేస్ – ఆన్ డిస్ల్పే, లాక్ స్క్రీన్స్ విడ్జెట్స్, మెసేజ్ యాప్‌లో మార్పులు వంటి ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్‌లో విడుదల కానున్న కొత్త ఫోన్లు ఐఓఎస్ 16 అప్డేట్‌తో రానున్నాయి.
మరి.. ఈ కొత్త అప్డేట్ పాత ఫోన్లకు వర్తిస్తుందా? అంటే, ఐఓఎస్ 15 అప్డేట్ ఐఫోన్ 6ఎస్‌లో వర్కౌట్ అయ్యింది. కానీ, ఐఓఎస్ 16 అప్డేట్ మాత్రం ఐఫోన్ 7 సిరీస్ నుంచి ఉండొచ్చని వార్తలొస్తున్నాయి. అంటే, ఆ సిరీస్‌కి ముందొచ్చిన పాత ఫోన్లకు కొత్త అప్డేట్ సపోర్ట్ చేయకపోవచ్చు. అయితే, ఈ విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. జూన్ 6వ తేదీన ఈ కొత్త అప్డేట్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగానే ఐపాడ్ ఓఎస్ 16ను కూడా యాపిల్ ప్రొడక్ట్ లాంచ్ చేయనుంది. ఇందులోనూ ఎన్నో అధునాతన ఫీచర్స్ ఉండనున్నట్టు తెలిసింది. ఇంతేకాదండోయ్.. యాపిల్ సంస్థ మరో సంచలనానికి కూడా తెరలేపనున్నట్టు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. గూగల్‌కి పోటీగా సెర్చ్ ఇంజన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.