Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
- ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్
- పెర్ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌పై హెచ్చరిక
- జూలై 17లోపు రద్దు చేయండి
- లేకుంటే ఛార్జీలు తప్పవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా గత ఏడాది ఉచితంగా Perplexity Pro AI సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేసుకున్న వినియోగదారులు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఒక సంవత్సరం ఉచిత ట్రయల్ గడువు ముగియనున్న నేపథ్యంలో, ఎయిర్టెల్ వినియోగదారులకు ఈమెయిల్‌లు, మెసేజ్‌ల ద్వారా నోటిఫికేషన్లు పంపిస్తోంది.
ట్రయల్ సమయంలో మీరు క్రెడిట్ కార్డ్ లేదా ఇతర చెల్లింపు విధానాన్ని యాడ్ చేసి ఉంటే, గడువు ముగిసిన తర్వాత సబ్స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రిన్యూవల్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇకపై ఈ సేవను ఉపయోగించకూడదనుకుంటే, ట్రయల్ ముగిసేలోపు తప్పనిసరిగా సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయాలి. లేదంటే మీ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బు డెబిట్ అయ్యే అవకాశం ఉంది.
Also Read
- Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- OnePlus N6x: వన్‌ప్లస్ N6x త్వరలో భారత్‌లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
జూలై 17లోపు రద్దు చేయకపోతే ఏమవుతుంది?
సమాచారం ప్రకారం, ట్రయల్ సమయంలో చెల్లింపు వివరాలను జోడించిన వినియోగదారులు జూలై 17లోపు సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయకపోతే, కంపెనీ ఎంపిక చేసిన ప్లాన్ ప్రకారం ఆటోమేటిక్‌గా చార్జీలు విధించవచ్చు. Perplexity Pro వార్షిక ప్లాన్ విలువ సుమారు రూ.17,000 కాగా, కొంతమంది వినియోగదారుల ఖాతాల్లో నెలవారీ ప్లాన్ ఆధారంగా కూడా చార్జీలు విధించే అవకాశం ఉంది.
ఎయిర్టెల్- పెర్ప్లెక్సిటీ భాగస్వామ్యం
2025 జూలైలో ఎయిర్టెల్, AI సెర్చ్ ప్లాట్‌ఫామ్ Perplexity AIతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, DTH వినియోగదారులకు దాదాపు రూ.17,000 విలువైన Perplexity Pro సేవను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందించింది. ఈ ఆఫర్ తర్వాత ముగిసిపోయినప్పటికీ, అప్పటికే యాక్టివేట్ చేసుకున్న వినియోగదారులు పూర్తి ఏడాది పాటు సేవను వినియోగించుకున్నారు. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో సబ్స్క్రిప్షన్ ఆటో రిన్యూవల్పై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Perplexity Pro సబ్‌స్క్రిప్షన్‌ను ఎలా రద్దు చేయాలి?
మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడానికి ఈ దశలను అనుసరించండి:
Perplexity అధికారిక వెబ్సైట్లో మీ ఖాతాలో లాగిన్ అవ్వండి.
ఎడమవైపు ఉన్న All Settings పై క్లిక్ చేయండి.
Account విభాగంలోకి వెళ్లండి.
అక్కడ “Thanks for subscribing to Perplexity Pro” అనే సమాచారం కనిపిస్తుంది.
దాని కింద ఉన్న Manage ఎంపికను ఎంచుకోండి.
Cancel Subscription పై క్లిక్ చేసి రద్దు ప్రక్రియను పూర్తి చేయండి.
రద్దు చేసిన తర్వాత మీ ఖాతాలో స్టేటస్ సరిగా అప్డేట్ అయ్యిందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి.
Android, iPhone వినియోగదారులు ఎలా రద్దు చేయాలి?
iPhone (iOS)
Settings → Apple ID → Subscriptions కు వెళ్లండి.
Perplexity Pro సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకుని Cancel Subscription పై క్లిక్ చేయండి.
Android
Google Play Storeలో Payments & Subscriptions → Subscriptions విభాగానికి వెళ్లండి.
Perplexity Pro సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకుని Cancel చేయండి.
మీ ఖాతా నుంచి డబ్బు కట్ అవుతుందా?
మీరు ఎప్పుడూ క్రెడిట్ కార్డ్ లేదా ఇతర చెల్లింపు విధానాన్ని జోడించకపోతే, లేదా మీ ఖాతాలో సబ్స్క్రిప్షన్ Paused లేదా Expiredగా కనిపిస్తే, సాధారణంగా ఆటోమేటిక్‌గా డబ్బు కట్ అయ్యే అవకాశం ఉండదు. అయితే, భవిష్యత్తులో అనవసరమైన ఛార్జీలను నివారించేందుకు మీ ఖాతాలోని సబ్స్క్రిప్షన్ స్టేటస్ ను తనిఖీ చేసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్‌వరల్డ్ యాంథమ్‌గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్‌పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?