ఈ ప్రపంచం రోజూ రోజుకు కొత్త టెక్నాలజీలతో ముందుకు వెళుతుంది.. కళ్ళను సైతం నమ్మలేని కొన్ని అద్భుతమైన టెక్నాలజీలను చూసి ఆనందపడాలో, ఏం జరుగుతుందో అని భయ పడాలో అని జనాలు సంధిగ్ధంలో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో జాబ్స్ ఊడతాయని ఆందోళన చెందాలో, నూతన అనుభూతులను పరిచయం చేయడానికి AI సిద్ధమవుతోందని తెలిసి ఆనందపడా లో అర్థం కావడం లేదు.. అయితే ఇప్పుడు పెళ్లి కానీ, వాళ్లకు గర్ల్ ఫ్రెండ్ లేదని ఫీల్ అవుతున్న వారికి AI టెక్నాలజీ ఒక పరిష్కారం చూపిస్తుందని తెలుస్తుంది..
AI టెక్నాలజీని ఉపయోగించి గర్ల్ లేదా బాయ్ ఫ్రెండ్ ని ఎలా రూపొందించుకోవాలో వివరించే ఓ గైడ్ ను ఆ కంపెనీ ‘గిట్ హబ్’లో షేర్ చేసింది. నచ్చిన వ్యక్తిత్వం, నేపథ్యాన్ని ఎంటర్ చేసి కావాల్సిన విధంగా స్నేహితులను క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ కోసం అందుబాటులో ఉంది. అయితే దీని ద్వారా రొమాంటిక్ చాట్ చేసే బోట్స్ క్రియేట్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది..
ఇకపోతే ఇటీవల శృంగారపు కోరికలను తీర్చికొనేందుకు ఓ AI కంపెనీ భాగస్వాములను ప్రవేశ పెట్టిందని తెలుస్తుంది.. ఆ ఫీల్ వాటితో కలగాలంటే భారీగానే చెల్లించాలని ఆ సంస్థ చెబుతుంది. ఇందు కోసం పెద్ద మొత్తంలో వెచ్చించాల్సి రావడంతో అదికాస్తా వెనక్కు తగ్గింది. ఏది ఏమైనా టెక్నాలజీ ద్వారా డిజైన్ చేసుకునే మెషీన్లకు మానవ ప్రతి స్పందనలు ఉండవని గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది.. అందుకే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే అని గుర్తుంచుకోండి… ఇది ఇలా ఉండగా సెక్యూరిటీ కోసం కోసం ఈ టెక్నాలజీని వాడుతున్నారు.. ఇక ముందు ముందు ఎలాంటి టెక్నాలజీ వస్తుందో చూడాలి.. ఇప్పటివరకు వచ్చిన టెక్నాలజీ జనాలను మెప్పించిందనే చెప్పాలి