Acerpure Aspire Neo: భారత మార్కెట్లోకి ఏసర్‌ప్యూర్ ఇండియా తన కొత్త నియో సిరీస్ స్మార్ట్ టీవీలును విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Aspire Neo, Swift Neo UHD LED, Elevate Neo QLED మోడళ్లు ఉన్నాయి. 32 ఇంచుల నుంచి 65 ఇంచుల వరకు విభిన్న స్క్రీన్ సైజుల్లో ఈ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. తాజా Google TV 5.0తో పాటు Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తున్న ఈ టీవీల్లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ కూడా ఉంది.
Telangana Weather Update: తెలంగాణను వదలని వరణుడు.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!
Aspire Neo మోడళ్లు 32 అంగుళాలు, 43 అంగుళాల స్క్రీన్ సైజ్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి 60Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు Dolby Audio (30W) సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. అలాగే 1GB RAM, 8GB స్టోరేజ్‌తో వస్తున్నాయి. అలాగే Swift Neo UHD LED మోడళ్లు 43 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల వేరియంట్లలో లభ్యమవుతాయి. వీటిలో డాల్బీ ఆటమ్స్ సపోర్ట్‌తో కూడిన అనుభవం లభిస్తుంది. 2GB RAM + 16GB స్టోరేజ్‌తో పాటు AI Picture Quality (AIPQ), ALLM, VRR, MEMC, Filmmaker Mode, అలాగే కరావోకే ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇక Elevate Neo QLED మోడళ్లు కూడా 43 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల వేరియంట్లలో వస్తాయి. వీటిలో QLED డిస్‌ప్లే, Dolby Vision, Dolby Atmos సౌండ్ సిస్టమ్ లభ్యమవుతాయి. అలాగే MEMC, ALLM, VRR వంటి గేమింగ్ ఫీచర్లతో పాటు గేమ్‌ప్యాడ్ సపోర్ట్ సౌకర్యం కూడా ఉంది. వీటితోపాటు, 40W పవర్‌ఫుల్ స్పీకర్లతో మరింత శక్తివంతమైన ఆడియో అనుభవాన్ని ఇస్తాయి.
నియో సిరీస్‌లో Aspire Neo టీవీలు Dolby Audio సౌండ్‌తో వస్తుండగా.. Swift Neo, Elevate Neo మోడళ్లు Dolby Atmos సౌండ్ టెక్నాలజీని అందిస్తున్నాయి. Aspire మోడల్‌లో 16.7 మిలియన్ కలర్స్ డిస్‌ప్లే ఉంటే.. స్విఫ్ట్, ఎలేవేట్ మోడళ్లలో 1.07 బిలియన్ కలర్స్ సపోర్ట్ లభిస్తోంది. ముఖ్యంగా Elevate Neo QLED మోడళ్లు డాల్బీ విజన్, QLED డిస్‌ప్లేతో మెరుగైన విజువల్ అనుభవాన్ని ఇస్తాయి. ఈ సిరీస్‌లో RAM + స్టోరేజ్ కాన్ఫిగరేషన్ 1GB + 8GB నుంచి 2GB + 16GB వరకు లభిస్తుంది. గేమింగ్ కోసం ALLM, VRR, MEMC, Gamepad సపోర్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఫిలింమేకర్ మోడ్, AI కంటెంట్ క్రియేటర్, Karaoke వంటి లైఫ్‌స్టైల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్స్ ఉన్నాయి.
Speed Post: రేపటి నుంచే పోస్టల్ కొత్త రూల్స్ అమల్లోకి.. ఇకపై ఓటిపి ఆధారిత డెలివరీలు..
కనెక్టివిటీ పరంగా డ్యూయల్ Wi-Fi, బ్లూటూత్, క్రోమ్క్యాస్ట్, Satellite ట్యూనర్, 3x HDMI 2.0, 2x USB 2.0 పోర్టులు సపోర్ట్ అవుతున్నాయి. ఈ నియో సిరీస్ స్మార్ట్ టీవీల ధరలు రూ. 22,499 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ టీవీలు ప్రస్తుతం అమెజాన్, Acerpure ఆన్లైన్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు.