ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు కెమెరాపై దృష్టి పెడతారు. అందుకే మొబైల్ మార్కెల్‌లో 50MP కెమెరాలు ఉన్న ఫోన్‌లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. రూ.10,000 లేదా రూ.50,000 ధర ఉన్న ఫోన్ అయినా.. కనుగోలుదారులు 50MP కెమెరా ఉందా అని చూస్తున్నారు. అయితే 200MP కెమెరాలు ఉన్న ఫోన్‌లు మొబైల్ మార్కెల్‌లో చాలా తక్కువగా ఉన్నాయి. బెస్ట్ ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికోసం 200MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ఓసారి చూద్దాం.
200MP కెమెరాలతో అనేక ఫోన్లు త్వరలో భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఏ ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉంటాయో తెలుసుకుందాం. 200MP కెమెరాతో కూడిన Oppo Find X9 సిరీస్ భారతదేశంలో లాంచ్ అయింది. Find X9 Pro 200MP టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ.109,999 నుంచి ఆరంభం అవుతుంది. ఈ ఫోన్ పవర్ ఫుల్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. Vivo X300 సిరీస్‌లో 200MP కెమెరా కూడా ఉంటుంది. ఈ సిరీస్‌లో కంపెనీ రెండు స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో విడుదల చేస్తుంది. అవి Vivo X300, X300 Pro. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లలో 200MP కెమెరా ఉంటుంది. ప్రో వేరియంట్‌లో 200MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది, స్టాండర్డ్ వేరియంట్‌లో 200MP ప్రధాన లెన్స్ ఉంటుంది.
Also Read: World Cup 2026 Schedule: ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది.. వేర్వేరు గ్రూప్‌ల్లో భారత్, పాకిస్థాన్!
Samsung Galaxy S26 Ultra ఫోన్ 200MP కెమెరాను కలిగి ఉండనుంది. ఈ ఫోన్ వచ్చే ఏడాది లాంచ్ అవుతుంది. ప్రస్తుతం మీరు Samsung Galaxy S25 Ultraలో 200MP కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ ధర రూ.129,999గా ఉంది. 200MP కెమెరాతో బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే…Vivo V60eని పరిశీలించొచ్చు. ఈ ఫోన్ రూ.31,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 200MP + 8MP బ్యాక్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మీరు బడ్జెట్ ఫోన్ కావాలనుకుంటే Redmi Note 13 Pro 5Gని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.23,999. ఇందులో 200MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. అలానే 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.