ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అఖండమైన విజయం సాధించింది. ఈ విజయం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఈ విజయం తన బాధ్యతను మరింత పెరిగిందని, గొప్ప విజయాన్ని అందించిన ప్రజలకు రుణపడి ఉంటానని వైఎస్ జగన్ పేర్కొన్నారు. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల నుంచి ఇప్పుడు జరిగిన పరిషత్ ఎన్నికల వరకూ అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 99 శాతం,…
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలకు సంబందించిన పూర్తి ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు అధికార వైసీపీకి అనుకూలంగా ఉండటం విశేషం. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ దూసుకుపోయింది. భారీ విజయాలు నమోదు చేసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 7,219 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అధికార వైసీపీ 5998 చోట్ల విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 826 చోట్ల, జనసేన 177 చోట్ల, బీజేపీ 28, సీపీఎం15, సీపీఐ 8, ఇతరులు 157 స్థానాల్లో విజయం సాధించారు. ఇండిపెండెంట్లు ఎక్కువ స్థానాలు…
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికలల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. రాత్రి నాటికి పూర్తి జిల్లా పరిషత్ ఫలితాలు వెలువడుతాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక ఈ నెల 24న జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిషత్లో కో ఆఫ్షన్ మెంబర్స్, చైర్మన్ , వైఎస్ చైర్మన్ ఎన్నిక 25న జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని గిరిజా శంకర్ వెల్లడించారు. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఎంపీటీసీ…
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబందించిన ఫలితాలు వెటువడుతున్నాయి. ఎంపీటీసీ ఫలితాల్లో దూసుకుపోతున్న వైసీపీ ఇప్పుడు జెడ్పీటీసి ఫలితాల్లో కూడా మెరుగైన స్థానాలు సొంతం చేసుకున్నది. మొత్తం 642 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, అందులో 152 స్థానలకు సంబందించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ 152 స్థానాల్లో అధికార వైసీపీ సొంతం చేసుకున్నది. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు 3,985 ఎంపీటీసీ స్థానాలకు సంబందించిన ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో వైసీపీ 3585 స్థానాల్లో విజయం సాధించగా,…
ఆంధ్రప్రదేశ్‌లోని మండల పరిషత్, జిల్లా పరిషతుల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం… గతంలో ప్రకటించిన ప్రత్యేక అధికారుల పాలన ఈ నెల 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో.. మరో ఆరు నెలల ప్రత్యేక పాలన కొనసాగుతుందంటూ వెల్లడించింది ఏపీ సర్కార్.. ఏప్రిల్ 8న మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు పూర్తయినప్పటికీ, హైకోర్టు ఆదేశం కారణంగా ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. తాజాగా తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది…
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికలను నిర్వహించిన తరువాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది. గతంలో నిర్వహించిన పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని ఏపీ హైకోర్టు తీర్పులో పేర్కొన్నది. హైకోర్టు తీర్పుపై ఏపి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో…