CM Revanth Reddy: నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్చార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో అగ్రనేత రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 కి జూమ్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలవడనున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధన్యత సంతరించుకుంది.
తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణను రూపొందించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఈనేపథ్యంలో.. నేరుగా సమావేశం పెట్టకుండా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ శ్రేణులు దాడి సంచలనంగా మారింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజకీయ వైరం పీక్స్‌కు చేరుకుంది. ఇటీవల వెల్లడైన పదోతరగతి ఫలితాలపైనా రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్ధులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు టీడీపీ నేత నారా లోకేష్. అయితే టీడీపీ పొలిటికల్ స్క్రీన్‌పై వైసీపీ నేతలు ప్రత్యక్షం కావడంతో రచ్చ రచ్చ అయింది. టీడీపీ అంటే ఒంటికాలిపై లేచే మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ నుంచి గెలిచి..…
ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తోంది.. ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలు తగ్గే వరకు విద్యుత్ చార్జీలు తగ్గే వరకు, రైతులు పండించిన పంటలు చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పోరాటాలు సాగుతాయన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ రోజు అన్ని జిల్లా…
ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న పరిస్థితులతో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన ఏపీ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉందని ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు జూమ్ సమావేశం నిర్వహించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమయస్ఫూర్తితో వ్యవహరించటం ఎంతో కీలకమని ఆయన విద్యార్థులకు సూచించారు. పాస్ పోర్ట్ సహా ఇతర ఆధారాలు ఎప్పుడూ వెంటే…