గ్రేట్ ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభంలోనే చెత్త రికార్డును క్రియేట్ చేశాడు. 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ కొట్టిన ఆరు సిక్స్‌లను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఆ విధ్వంసానికి గురువారంతో 17 ఏళ్లు. ఈ క్రమంలో బ్రాడ్ స్పందించాడు. అంపైర్ నో బాల్ ఇస్తే.. యువరాజ్ ఏడు సిక్సర్ కొట్టేవాడని బ్రాడ్ చెప్పాడు.