Yuvatha Poru: శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా పరిషత్ వరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘యువత పోరు’ కార్యక్రమానికి యువత భారీగా ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం యవతకు మోసం చేస్తోందని, కూటమి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ…
కూటమి ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, ఇంతవరకూ ఆ ఊసే లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సమున్నత ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం నీరుగారుస్తోందని, బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఏడాది తల్లికి వందనంను ఎగ్గొట్టారని, వచ్చే ఏడాది నుంచి ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో విద్యారంగం ఎంతో పటిష్టంగా తయారైందని మాజీ మంత్రి కాకాణి చెప్పుకొచ్చారు. నెల్లూరులో వైసీపీ ఆధ్వర్యంలో ‘యువత…
‘ఫీజు పోరు’ అని ముందుగా పేరు పెట్టి.. ఆ తర్వాత ‘యువత పోరు’ అని పేరు మార్చటంపై జనాలు నవ్వుకుంటున్నారని మంత్రి నారా లోకేష్ వైసీపీపై సెటైర్లు వేశారు. అసలు వైసీపీ వాళ్లకు దేని మీద పోరాడుతున్నారో కనీసం క్లారిటీ ఉండాలి కదా? అని ఎద్దేవా చేశారు. స్వల్పకాలిక ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు తాము సిద్ధం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.…
కన్నుమూసి తెరిచే లోపు ఏడాది గడిచిందని.. మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రజల కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని.. వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు అవుతుందన్నారు. వైసీపీ ఏదైనా చెప్పిందంటే.. తప్పకుండా చేస్తుందన్న నమ్మకం జనాల్లో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. వైసీపీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రజల గొంతుకగా పోరాడుతుంది…
రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైసీపీ సిద్ధమైంది. ‘యువత పోరు’ పేరుతో ధర్నా కార్యక్రమంను నేడు వైసీపీ చేపట్టనుంది. ఈరోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు నాయకులు, కార్యకర్తలు చేయనున్నారు. అనంతరం వైసీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మోసాలపై విద్యార్థులు, నిరుద్యోగులు నినదించనున్నారు. అంతేకాదు ధర్నాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువతతో కలిసి వైసీపీ పోరుబాకు సిద్ధమైంది. అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ…
Sajjala Ramakrishna Reddy: తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వైసీపీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు అని మండిపడ్డారు.