వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతికి పోలీస్ కు విధించిన 48 గంటల గడువు నేటితో పూర్తైంది. అయితే పాదయాత్ర అనుమతిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇవాళ నర్సంపేట ఏసీపీ వద్దకు YSRTP నేతలు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు నర్సంపేట ACP ను YSRTP నేతలు కలవనున్నారు.
తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల.. ఇప్పటికే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా రిజిస్ట్రర్ చేశారు.. వచ్చే నెలలో పార్టీ జెండా, అజెండా ప్రకటించనున్నారు.. ఈ నేపథ్యంలో… రేపు అన్ని జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు వైఎస్ షర్మిల.. రేపు ఉదయం 9.30 గంటలకు లోటస్ పాండ్ లో ఈ సమావేశం జరగనుండగా… జూలై 8న పార్టీ ఆవిర్భావం, పార్టీ బలోపేతం,…