Somu Veerraju: జగన్‌కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: తిరుపతిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీవీతో మాట్లాడుతూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఆరోపించారు. 2029 ఎన్నికల్లో జగన్ ప్రజలకు ఏమి చెప్పి ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. జగన్‌కు నిజంగా దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సోము వీర్రాజు సవాల్ విసిరారు. “మావిగన్ గురించి చర్చిద్దాం రా జగన్” అంటూ వ్యాఖ్యానించిన ఆయన, అది “మావిగన్ కాదు.. మాయగాన్, అబద్ధాల గన్” అంటూ ఎద్దేవా చేశారు. జగన్ చెప్పే ప్రతి మాట అబద్ధమేనని ఆరోపించారు.
రాజధాని అంశాన్ని ప్రస్తావించిన సోము వీర్రాజు, మొదట అమరావతిలో ఇల్లు కట్టుకుంటానని చెప్పిన జగన్, తర్వాత మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. చివరకు అమరావతిలో ఇల్లు కూడా కట్టలేదని, మూడు రాజధానులు కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. రాజధాని అభివృద్ధికి తన పాలనలో ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం, ఇసుక, గ్రావెల్, భూముల వ్యవహారాల్లో అవినీతి జరిగిందని సోము వీర్రాజు ఆరోపించారు. గత ఐదేళ్ల పాలన మొత్తం అవినీతిమయంగా మారిందని విమర్శించారు.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ప్రస్తుతం వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయని, అలాంటి పరిస్థితిలో బలం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు సోమువీర్రాజు.. రానున్న ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన హామీలు, ప్రజలను మోసం చేసిన అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉంటుందని, అదే అమరావతి అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధిపైనే ప్రభుత్వం ముందుకు సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!