ఈ మధ్య కాలంలో కార్యకర్తలతో ఏ సమావేశం నిర్వహించినా వైసీపీ అధినేత జగన్ రిపీట్ చేస్తున్న ఒకే మాట జగనన్న 2.o. ఇక నుంచి కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇస్తా.. మీకోసం ఎంతదాకైనా వస్తా..... అందర్నీ గుర్తు పెట్టుకుంటానని కూడా చెప్పుకొస్తున్నారు జగన్. 2019-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని విస్మరించి కేవలం వాలంటీర్స్ని నెత్తిన పెట్టుకున్నారన్న విమర్శలున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.. పులివెందుల నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. పులివెందులలోని మెడికల్ కాలేజీని సందర్శించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎంత మేలు చేశారో అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయేందుకే నా పయనం అన్నారు.
ఇప్పటికైనా మారు.. లేకపోతే రాజకీయంగా సమాధి అవుతావు అంటూ వైఎస్ జగన్కు కీలక సూచనలు చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పలు అంశాలపై స్పందించారు.. టీడీపీ మహానాడుకు వెళ్తే.. అక్కడి జనాలను చూసి మైండ్ పోయిందన్నారు.. అక్కడ వచ్చింది లీడర్లు కాదు.. సామాన్య ప్రజలే ఎక్కువ అన్నారు..
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అరాచక, మోసపూరిత పాలనకు జూన్ 4కు ఏడాది అవుతుందని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రశ్నించే గొంతులు లేవకుండా భయోత్పాతాన్ని సృష్టించిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఉండదన్నారు.
SV Mohan Reddy: దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న చీకటి జీవోపై వైఎస్సార్సీపీ తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయ భూములను కొల్లగొట్టే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరదీసింది. ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం అని అన్నారు. Read Also:…
Ravindranath Reddy: కడప జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ముఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా “వెన్నుపోటు దినం”గా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని కారణంగా ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు. జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు…
Siva Prasad Reddy: వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రజలు ఈ ప్రభుత్వ పాలనపై విసుగుతో ఉన్నారని, మాటలతో మోసగిస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రాప్తాడు సిద్ధం సభకు వచ్చిన ప్రజల సంఖ్యను చూసిన తర్వాత కూడా కొందరు టీడీపీ మహానాడు సమావేశంతో పోల్చడం హాస్యాస్పదం. మేము నిర్వహించిన సభకు జనాలు స్వచ్ఛందంగా వచ్చారు.…
గుంటూరు వెస్ట్.. రాజకీయంగా మంచి ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. కానీ... ఇక్కడ ఇన్ఛార్జ్ని నియమించుకోలేక సతమతం అవుతోందట వైసీపీ. అలాగని.... పార్టీకి ఇక్కడ నాయకుల కొరతేం లేదు
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ను హైకోర్టు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Gadikota Srikanth Reddy: చంద్రబాబు పదహారేళ్ళ పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చారా అని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ హయంలోనే ఫ్యాక్షన్ క్రియేట్ చేశారు.. రాయలసీమలో వైఎస్ఆర్ ఫ్యాక్షన్ అరికట్టేందుకు కొత్త నేతలను తీసుకు వచ్చారు.. మీ దుష్ట శక్తుల సాయంతో జగన్ ను ఓడించినంత మాత్రాన మీరు సాధించింది ఏమీ లేదు.