జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ సర్కార్, సీఎం, మంత్రులపై చేసిన కామెంట్లు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. జనసేనానిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు మంత్రులు, వైసీపీ నేతలు.. తాజాగా సినీ దర్శకనిర్మాణ, నటుడు పోసాని కృష్ణ మురళీ కూడా పవన్ కల్యాణ్‌పై పదునైన విమర్శలు చేశారు. అయితే, సోషల్ మీడియా వేదికగా మంత్రి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ.. ఓ పద్యం రూపంలో… “తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు..…
ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్లో భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతూనే ఉంది.. అయితే, ఆ వ్యాఖ్యలకు బరింత బలాన్ని ఇచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేవారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి… ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు ఉంటాయని తెలిపారు. మంత్రి వర్గంలో వందశాతం కొత్తవారినే తీసుకుంటారని సీఎం వైఎస్ జగన్ చెప్పారని తెలిపిన ఆయన.. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎం జగన్‌కు చెప్పానని పేర్కొన్నారు.. ఇక,…
చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి… ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటగా.. ఎంపీపీ ఎన్నికల విషయంలో.. స్థానిక ఎమ్మెల్యే రోజాకు సెగ తగిలింది.. నిండ్ర మండలం.. ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజా నిర్ణయించిన అభ్యర్థికి స్థానిక నేతలు చక్రపాణిరెడ్డితో పాటు అతడి తమ్ముడు కూడా మద్దతు ఇవ్వలేదు.. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మెల్యే రోజా.. స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఇలా చేయడం సరికాదన్నారు.…
వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్కు సిద్ధం అవుతోంది ఏపీ ప్రభుత్వం.. సిబ్బంది కొరతలేని ప్రభుత్వాసుపత్రి దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటుంది సర్కార్.. అందులో భాగంగా సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్యకళాశాల, బోధనాసుపత్రుల వరకూ వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.. అక్టోబర్ నుంచి ప్రక్రియను ప్రారంభించి.. నవంబర్ 15 నాటికి ముగించాలన్న ప్లాన్‌కు సీఎం ఆమోదం తెలిపారు.. వైద్య ఆరోగ్యశాఖపై ఇవాళ…
ఆచంట ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకున్నది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంటలో టీడీపీ 7 చోట్ల, వైసీపీ 6 చోట్ల, జనసేన 4 చోట్ల విజయం సాధించింది. దీంతో, టీడీపీ, వైసీపీలు ఇద్దరిలో ఎవరు ఎంపీపీ కావాలి అన్నా జనసేన మద్ధతు అవసరంగా మారింది. క్యాంపు రాజకీయాలు షురూ కావడంతో టీడీపీ, జనసేన పార్టీలు తమ ఎంపీటీసీలను రహస్యప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ ఎంపీపీ పదవి కోసం టీడీపీ, జనసేన పార్టీలు పొత్తును కుదుర్చుకున్నాయి.…
పరిషత్ ఎన్నికల ఫలితాల్లో జనసేన పర్వాలేదు అనే స్థాయిలో స్థానాలను కైవసం చేసుకుంది.. రాజమండ్రి ఎంపీ భరత్ దత్తత గ్రామంలోనూ సత్తాచాటిన జనసేన విజయం సాధించింది.. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయగా.. ఇవాళ కౌంటర్ ఇచ్చారు ఎంపీ భరత్.. నా దత్తత గ్రామం పొట్టిలంకలో ఎంపీటీసీ ఓటమిపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికావన్న ఆయన.. దత్తత తీసుకుంటే ఖచ్చితంగా గెలవాలని ఎలా చెప్పగలం.. అని ప్రశ్నించారు.. ఇక, జనసేన ప్రభావం ఆ గ్రామంలో…
కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనుకడుగు వేయడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు డ్వాక్ర మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది వైసీపీ సర్కార్.. అక్టోబర్ 7వ తేదీ నుంచి వరుసగా 10 రోజుల పాటు విజయ దశమి కానుకగా రెండో విడత ఆసరా అందజేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.. స్పందన కార్యక్రమం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. అక్టోబర్ 7 నుంచి 10 రోజుల పాటు…
పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. అయితే, మేం ఎన్నికలను బహిష్కరించడం వల్లే ఈ ఫలితాలు అంటోంది తెలుగుదేశం పార్టీ.. కానీ, వైసీపీ మాత్రం టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.. కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు.. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పులు తెలుసుకోవాలని సూచించారు.. కోర్టుల ద్వారా వైఎస్…