కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ముగిసే సమయానికి ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఏంలను పోలింగ్ సిబ్బంది సీల్ చేస్తున్నారు. అనంతరం ఈవీంఏంలను భారీ భద్రతతో స్ట్రాంట్ రూంకి తరలించనున్నారు. అయితే సాయంత్రం 5 గంటలకు వరకు 59 గా పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారుల వెల్లడించారు. 2019లో 77 శాతం…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. కుప్పంలోని సామగుట్టపల్లెలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై పలు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రెండున్నర ఏళ్లుగా అభివృద్ధి ఆగిపోయిందని, రెస్కోను డిస్కంలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని వాటిని మేము అంగీకరించబోమన్నారు. అంతేకాకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ హయాంలో కట్టించిన ఇళ్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్థలం ఇవ్వలేదు, ఇల్లు కట్టలేదు కానీ…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు సానుభూతి రాజకీయాలకు తెరలేపారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘అన్ని ఎన్నికల్లో ఓడి తలబొప్పి కట్టడంతో సానుభూతి కోసం కుప్పంలో వీధి నాటకాలకు తెరతీశాడు చంద్రబాబు. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులు చేయించాడు. తనపైనే ఎవరో దాడి చేస్తున్నట్లు నిద్దట్లో కలవరిస్తూ ఆ ఫస్ట్రేషన్ జనంపై చూపిస్తున్నాడు. ఏంటి బాబు ఈ డ్రామాలు? ఓట్ల…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. 14 ఏళ్ల ముఖ్యమంత్రివా లేక వీధి రౌడివా? అంటూ కామెంట్ చేసిన ఆమె.. “యథా రాజా తథా ప్రజా” అంటారు.. అయితే ఇప్పుడు అది తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబుకే సరి పోతుందని ఎద్దేవా చేశారు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అతనిని నమ్మి ఓటేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలకి హంద్రీ – నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు కూడా ఇవ్వకుండా…
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.. అయితే, కొన్ని పోలింగ్ బూతుల్లో బీజేపీ ఏజెంట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలను కూర్చోవడం చర్చగా మారింది.. మరోవైపు.. పలు ప్రాంతాల్లో బీజేపీ ఏజెంట్లను ఇబ్బందులకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.. మరోవైపు.. ఎస్సై చంద్రశేఖర్‌పై ఎస్పీ అన్భురాజన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… దీంతో.. ఎస్సై చంద్రశేఖర్‌ను ఎన్నికల విధుల నుంచి…
కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇవాళ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.. రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది.. అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉన్నా.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ తరపున ఏజెంట్లుగా కూర్చోవడం చర్చగా మారింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నుమూయడంతో వచ్చిన ఈ ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్థిని పెట్టలేదు.. కానీ, బీజేపీ పోటీకి నిలిచింది.. అయితే, ఆ పార్టీకి సరైన…
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది… ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం… బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానించే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. అదాని ఎంటర్ ప్రైజెస్ కు 130 ఎకరాలను విశాఖ మధురవాడలో కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇక, 200 మెగా డేటా సెంటర్, బిజినెస్ పార్కు కోసం 130 ఎకరాల కేటాయించిన ఏపీ కేబినెట్.. ప్రకాశం జిల్లా…
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్ల ఆందోళనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.. సమస్యను పరిష్కరిస్తామన్న మంత్రి కొడాలి నాని హామీతో వెనక్కు తగ్గారు రేషన్ డీలర్లు.. నవంబర్ కోటా రేషన్‌కు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. కాగా.. జీవో నంబర్ 10 రద్దుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు ఆందోళన చేస్తూ వచ్చారు.. సీఎం జగన్ తమ సమస్యలపై స్పందించేంత వరకు నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు.. Read Also : బీజేపీకి…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అవుతుంది.. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం..ఆన్లైన్లో సినిమా టికెట్లు అమ్మకం, సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేసే అర్డినెన్సుకు అమోదం తెలిపే అంశంపైనా చర్చించే ఛాన్సుంది. ఇక, దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చట్టసవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీవింగ్ ఏర్పాటుపై చర్చించనుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ…
బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 7గంటలకు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉప ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. పోలింగ్ కు 72 గంటల ముందు నుంచే ఈ ప్రచారాలు ముగియడంతో మైకులు మూగబోయాయి. అయితే ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయరామారాజు, ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. బద్వేల్ నియోకవర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ పోలింగ్…