తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. ఖమ్మం జిల్లాలో టీడీపీ బహిరంగసభపై సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు.. తెలంగాణలో ప్రజలకు సేవ చేయాలని ఉంటే మంచిది.. ఏపీలో కూడా చేస్తామంటే ఇంకా మంచిదన్న ఆయన.. రాజకీయాలు అంటే చంద్రబాబుకు ఆట అని మండిపడ్డారు.. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి తెలంగాణకు వెళ్లాడు.. కానీ, ఏం చేయాలో కూడా చంద్రబాబుకు స్పష్టత లేదన్నారు..…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు.. మరోవైపు శుభకార్యాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఇంకోవైపు, కుటుంబ పెద్దలను, కుమారులను కోల్పోయినవారిని కూడా పరామర్శిస్తూ.. వారికి ధైర్యాన్ని చెబుతూ వస్తున్నారు.. ఇక, ఇవాళ తిరుపతి, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. సాయంత్రం తిరుపతికి వెళ్లనున్నారు వైఎస్ జగన్.. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. సాయంత్రం 5 .15కు తుమ్మలగుంట చేరుకోనున్నారు.. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్…
CM Jagan: ఏపీ సీఎం జగన్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా మోతెక్కింది. ట్విట్టర్ వేదికగా ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సీఎం జగన్ అభిమానులు తమ అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ #HBDYSJagan అనే హ్యాష్ టాగ్‌తో 5 లక్షల 50 వేలకు పైగా ట్వీట్లతో 300 మిలియన్స్‌కు పైగా రీచ్తో ట్రెండ్ చేశారు. డిసెంబర్ 20 సాయంత్రం…
DL Ravindra Reddy: కడప జిల్లా వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి రాగానే అవినీతితో పాలన మొదలుపెట్టారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఈ సారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పే అని, ఏపీని చంద్రబాబు తప్ప మరొకరు కాపాడలేరని అభిప్రాయపడ్డారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిజాయితీని ప్రశ్నించలేమని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానని డీఎల్ రవీంద్రారెడ్డి ఆకాంక్షించారు.…
పల్నాడు రాజకీయాలు మళ్లీ హీటుపెంచుతున్నాయి.. అయితే, పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్ పుట్టిన రోజు బహుమతిగా మైనారిటీ సోదరుని శవాన్ని గోపిరెడ్డి అందించారని సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. వైసీపీ వచ్చాక మైనార్టీలను ఊచకోత కోస్తున్నారని విమర్శించారు.. ముగ్గురు ఉన్మాదులు పల్నాడును వల్లకాడు చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు.. పిన్నెల్లి, కాసు, గోపిరెడ్డిలని పల్నాడు నుంచి ప్రజలు తన్ని తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం…
CPI RamaKrishna: వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి బుగ్గన అప్పులు తెస్తెనే …జగన్ బటన్ నొక్కే దౌర్భాగ్య పరిస్థితి ఉందని రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, మద్యం దొంగలు మాత్రమే బాగున్నారని చురకలు అంటించారు. మూడున్నరేళ్లలో రైతుకు ఉపయోగపడే ఒక్క పని కూడా జగన్ చేయలేదని విమర్శలు చేశారు. కనీసం కడపలో పిల్ల కాలువను కూడా జగన్ తవ్వలేదన్నారు. జగన్ ఎక్కడికి…
రాష్ర్టం మొత్తంలో ఎక్కడైనా నయాపైసా ధర్మాన ప్రసాద్ తీసుకున్నాడని చెప్పగలరా..? అని సవాల్ విసిరారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కల్లేపల్లి గ్రామం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు కోట్లాది రుపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, కేసులు విచారణకు రాకుండా స్టేలు తీసుకువస్తుంటాడు అని ఆరోపించారు.. మరోవైపు, నన్ను…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై హాట్ కామెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతి రాజు.. ఒక రాజధానిగా ఉన్నా.. ఇప్పుడే ఏ అధికారి దొరకడం లేదు.. మూడు రాజధానులు చేస్తే ఎక్కడికి వెళ్లాలి? అని ప్రశ్నించారు.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు వికేంద్రీకరణ అంటే ఏంటి..? అని నిలదీశారు.. కేంద్రం ఇచ్చిన నిధులను ఏమి చేస్తున్నారు? అని మండిపడ్డ ఆయన.. రాజధానిని మూడు…