Off The Record: సత్తెనపల్లిలో సీన్ రివర్స్.. ఎందుకో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్నటి వరకు ఒకటే లొల్లి. సీట్ మాకంటే మాకు అంటూ తిట్టుకున్నారు.. కొట్టుకున్నారు. అలాంటి బ్యాచ్ ఒక్కసారి సైలెంట్ అయ్యింది. అది ఏ స్థాయిలో అంటే మంత్రి మీద అవినీతి ఆరోపణలు చేస్తే పట్టించుకోనంత. కనీసం రియాక్ట్ కానంతగా. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా.. ప్రతిపక్ష నేత అయినా సరే మంత్రిపై వచ్చిన ఆరోపణలను లడ్డూలా పట్టుకుని దడదడలాడిస్తారు. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్. ఆ పార్టీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లింది ఎందుకు…?
జనసేన హడావిడితో టీడీపీ నేతలు సైలెంట్
Also Read
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తెలుగు తమ్ముళ్లు చడీచప్పుడు కాకుండా కూర్చుంటున్నారు. నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు ఓ రేంజ్‌లో హల్చల్ చేసిన నాయకులు సైతం నోరు మెదపడం లేదు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ మూడు నాలుగు వర్గాలుగా చీలి.. సీటు నాదంటే నాది.. నాకంటే నాకేనని తిట్టి కొట్టుకున్న వాళ్లు ఇప్పుడు గాయబ్ అయ్యారు. సడన్‌గా అందరూ సైలెంట్ అయిపోయారు. దీనికి కారణం నియోజకవర్గంలో జనసేన చేస్తున్న కార్యక్రమాల హడావిడేనని చెవులు కొరుకుంటున్నారు సత్తెనపల్లి ప్రాంత ప్రజలు.
అంబటి ఎపిసోడ్‌లో కనిపించని టీడీపీ
పవన్ కల్యాణ్ సత్తెనపల్లి పర్యటన, దానికి ముందు జనసేన నేతల హడావుడి ఒక ఎత్తు అయితే.. సాక్షాత్తూ మంత్రి అంబటి రాంబాబు ఓ బాధిత కుటుంబాన్ని లంచం అడిగారంటూ రేగిన వివాదంలో టీడీపీ ఎక్కడా కనిపించలేదు. తమ పార్టీని, అధినేతను పూచిక పుల్లలా చూసే అంబటి దొరికితే ఓ రేంజ్‌లో ఆటాడుకోవాల్సిన టీడీపీ గప్‌చుప్ అయ్యింది. అదే టైమ్‌లో జనసేన నాయకులు ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. ఈ విషయంలో కనీసం స్పందించని టిడిపి నాయకులు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
జనసేనకు సీటు ఇచ్చేస్తారా?
ఇలాంటి సంఘటన వేరే నియోజకవర్గంలో జరిగితే వ్యవహారం అంతా మాదే అని బరిలోకి దిగే టీడీపీ నాయకులు సత్తెనపల్లిలో ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది అసలు ప్రశ్న. అయితే ఇప్పటికే టిడిపిలో ఉన్న వర్గవిభేదాలతో సీటు ఎవరికి వస్తుందో క్లారిటీ లేదు. ఇప్పుడు అన్నిటికి మించి జనసేన ఈ ప్రాంతంలో పాగా వేయాలని ప్లాన్ చేయడం.. పొత్తు కూడా ఉండొచ్చనే అంచనాలతో.. కచ్చితంగా ఇక్కడ జనసేనకు సీటు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో తాము ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని కార్యక్రమాలు చేసినా పార్టీలో గుర్తింపు రాదు.. కనీసం ఇంచార్జి పదవి కూడా రాదు.. భవిష్యత్తులో సీటు వస్తుందన్న ఆలోచన లేదని నిట్టూరుస్తున్నారట. అలాంటప్పుడు ఉద్యమాలు, కార్యక్రమాలు చేయడం, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకనే ఆలోచనలో టిడిపి నాయకులు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.
.
టీడీపీ, జనసేన ముందే ఒప్పందానికి వచ్చాయా?
అంతేకాదు.. అధికారపార్టీ నేతల మీద ఆరోపణలు చేసి అనవసరంగా వాళ్లకి టార్గెట్ కావడం ఎందుకు అనే ఆలోచన నిన్నటి వరకు సీటు అడిగిన వాళ్లలో ఉందట. లేదంటే ఎప్పటినుంచో పోరాటాలు చేస్తున్న టిడిపిని కాదని బాధిత కుటుంబం జనసేన నాయకులను కలవడం ఏంటి? అక్కడి నుంచి పవన్‌తో భేటీ.. జనసేన ఉద్యమం చేయటం రాజకీయ పొత్తు వ్యవహారంగానే కనిపిస్తోంది. ఈ అంశంలో ఎక్కడా టిడిపి కనీసం వేలు పెట్టిన పరిస్థితి కూడా లేదు. సాధారణంగా నియోజకవర్గంలో ఓ మహిళకు, లేదా ఓ కుటుంబానికి అన్యాయం జరిగిందని సమాచారం వస్తే వెంటనే దాన్ని తమ క్రెడిట్‌గా చెప్పుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాయి. అలాంటి ప్రయత్నం కూడా ఇక్కడ టిడిపి నాయకులు చేయలేదు. దీనిని బట్టి స్థానికంగా టిడిపి, జనసేన నాయకులు ముందే ఓ ఒప్పందానికి వచ్చారా అనే అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి.
జనసేన ఎంట్రీతో జారుకుంటున్న టీడీపీ నేతలు
ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో ఏం జరిగినా జనసేన నాయకులు స్పందించినట్టుగా టిడిపి నాయకులు స్పందించడం లేదని టాక్ వినిపిస్తోంది. పొత్తుల మీద టీడీపీ, JSPలు క్లారిటీ ఇంతవరకు ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత కలిశారో అప్పటి నుంచే క్షేత్రస్థాయిలో.. ఇది మీకు అది మాకు అంటూ అనధికార పంపకాలు చేసుకుంటున్నారట. అలాంటి పరిస్థితుల్లో సత్తెనపల్లి నియోజకవర్గాన్ని జనసేన పోటీ చేయడానికి అనువుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే జనసేన పోటీ చేసేటప్పుడు.. మనకెందుకు వచ్చిన గోల అనుకుంటూ టిడిపి నేతలు చల్లగా జారుకుంటున్నారట. భవిష్యత్తులో నిజంగా పొత్తులు కుదురుతాయో లేదో, జనసేనకు ఇస్తారో లేదో తెలియదు గాని, ప్రస్తుతం టిడిపి నాయకుల వైఖరితో ప్రజల్లో మాత్రం పార్టీ పలచనవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. పక్కపార్టీతో పొత్తుల వ్యవహారం పక్కన పెట్టి.. లెక్కలు తేలే వరకు పోరాటాలు చేయాల్సిన నాయకులు ముందే కాడి వదిలేసి సర్దుకోవటం ఏంటని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అనే నానుడికి ఇదే ఉదాహరణ అంటూ చెవులు కోరుకుంటున్నారు సత్తెనపల్లి ప్రజలు.
- Tags
- Ambati
- ap
- janasena
- off the record
- tdp
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?